ప్రముఖ టెలికాం రంగ సంస్థ  వోడాఫోన్ .. దేశ వ్యాప్తంగా  వున్న తమ వినియోగదారుల కోసం సరికొత్త  ప్రీపెయిడ్  రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. అందులోభాగంగా 70రోజుల వ్యాలిడిటీతో 499 ప్లాన్ ను ప్రవేశపెట్టింది.. ఈప్లాన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే   రోజు 1.5జీబీ డేటా తోపాటు  ఏ నెట్ వర్క్ కు కైనా అన్ లిమిటెడ్ మొబైల్ కాల్స్, డైలీ 100 ఎస్ఏంఎస్ లు చేసుకొనే సదుపాయం కల్పించింది. అన్ని మేజర్ సర్కిళ్ల లలో ఈప్లాన్ అందుబాటులోకి రాగ  బీహార్ లాంటి  సర్కిల్ లలో 60రోజుల వ్యాలిడితో  ఈ ప్లాన్ ను ప్రవేశపెట్టారు. 
 
అలాగే ఇంతకుముందున్న 555రీఛార్జ్ ప్లాన్ లో మార్పులు చేసింది వోడాఫోన్. ఇంతకుముందు వరకు ఈ ప్లాన్ 70రోజుల వ్యాలిడిటీ మాత్రమే కలిగివుండగా ఇప్పడు దాన్ని మరో వారం రోజులు పొడిగించింది అంటే 77రోజుల వ్యాలిడిటీ తో ఈప్లాన్ అందుబాటులో ఉండనుంది. అయితే 555 ప్లాన్  499ప్లాన్  ఒకే రకమైన బెనిఫిట్స్ ను కలిగి వున్నాయి కాకపోతే  వ్యాలిడిటీ లో మాత్రమే తేడా ఉంటుంది. 
 
ఇదిలావుంటే  ఎయిర్ టెల్ ఈ 499ప్లాన్  ఎప్పుడో ప్రవేశ పెట్టింది.  అయితే ఇటీవల  ఈప్లాన్  ను 598 ప్లాన్ గా మార్చి 84రోజుల వ్యాలిడితో  రోజుకు 1.5జిబి డేటా, ఉచితంగా ఏ నెట్ వర్క్ కు కైనా  అపరిమితమైన కాల్స్ తో పాటు  రోజు 100ఎస్ఏంఎస్ లను చేసుకునే  సదుపాయాన్ని కలిపిస్తూ కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచింది.  ఇక ప్రస్తుతం  జియో, ఎయిర్ టెల్ తో తీవ్ర పోటీని ఎదుర్కొంటుంది వోడాఫోన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: