నేటి స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉండడం సర్వ సాధారణo. ఇక స్మార్ట్ ఫోన్ మ‌న‌ చేతిలో ఉంటే ప్రపంచం అంతా మన గుప్పిట్లో ఉనట్టే అని అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే  ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల కొత్త కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. వీటిలో కొన్ని మాత్రమే ఒరిజినల్ యాప్స్ . మరికొన్ని ఈ ఒరిజినల్ యాప్స్ కి ఫేక్ యాప్స్. అయితే వాటిల్లో ఒరిజినల్ యాప్స్ ఏవో ఫేక్ యాప్స్ ఏవో తెలియకుండానే వాటిని డౌన్‌లోడ్ చేసేస్తుంటాం. ఫేక్ యాప్స్‌తో జాగ్రత్తగా లేకుంటే ఫోన్‌లోకి వైరస్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. అలాగే మొబైల్ నిండా ఫేక్ యాప్స్ ఉంటే.. ఇక ఆ యూజర్ ప్రైవసీని గాలికి వదిలినట్టే. 

 

మ‌రి వాటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్లే స్టోర్‌‌‌‌లో ఒక యాప్ కోసం వెతికేటప్పుడు ‘ఎడిటర్స్ ఛాయిస్’ లేదా ‘టాప్ డెవలపర్’ లాంటి ట్యాగ్‌‌లు కనిపిస్తే అవి నమ్మకమైనవి అని అర్థం. నకిలీ యాప్స్‌‌కు ఎలాంటి ట్యాగ్సూ ఉండవు. ఒరిజినల్‌ యాప్‌లకు సంబంధించి ఖచ్చితంగా ఓ వీడియోను అప్‌లోడ్‌ చేస్తారు.ఆ వీడియోలను చూసి కూడా నకిలీయా..అసలా.. అన్నది ఇట్టే కనిపెట్టవచ్చు. అలాగే యాప్స్ ని డౌన్లోడ్ చేయడానికి ముందు ఆ యాప్స్ యొక్క కొన్ని రివ్యూస్ ని  చదవడంలో ఎలాంటి టైం వేస్ట్ అనుకోకూడదు. 

 

ఒకవేళ ఇది ఒక నకిలీ యాప్ అయ్యి ఉంటే దాని గురించి చెప్పే రివ్యూస్ కొన్ని ఉంటాయి. అందుకే ఈ యాప్ ని డౌన్లోడ్ చేయడానికి ముందు యాప్ గురించి ఇతరులు ఏమి రివ్యూ  చెప్పారో తెలుసుకోవడం మంచిది. అదే విధంగా ఏదైనా కొత్త యాప్‌ గురించి తెలుసుకోవాలంటే.. అది కొత్తదా లేక పాతదా మొదటగా గుర్తించాల్సి ఉంటుంది. గూగుల్‌లో సెర్చ్‌ చేసిన యాప్‌కు సంబంధించిన సమాచారంతో, ప్లేస్టోర్‌లో ఇచ్చిన సమాచారాన్ని సరిచూసుకోవాలి. అప్పుడు నకిలీ ఏదో, అసలు ఏదో తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: