వాట్సాప్.. నేటి తరానికి పరిచయం అక్కర్లేని పేరు. స్మార్ట్‌ఫోన్‌ కొనే చాలామంది మొదట ఇన్‌స్టాల్‌ చేసే యాప్‌ వాట్సప్‌ అంటే అతిశయోక్తి కాదు.  మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్ ను విపరీతంగా వాడుతున్నారు. అయితే సోషల్ మీడియా ప్రాచుర్యం పెరుగుతున్న కొద్ది నకిలీ అకౌంట్ల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది.. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్‌లలో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేయటం చాలా సులువైపోయింది.

 

ఈ క్ర‌మంలోనే వాట్సాప్ ఫేక్ అకౌంట్‌లను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. +1 నెంబర్‌తో వచ్చే వాట్సాప్ మెసెజ్‌లను నకిలీ వాట్సాప్ మెసెజ్ లుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇటువంటి ఫేక్ నెంబర్స్ ఎక్కువుగా voxox app ద్వారా క్రియేట్ చేయబడతాయి. కాబట్టి, +1 నెంబర్‌తో వచ్చే వాట్సాప్ మెసెజ్‌లను ఏ మాత్రం విశ్వసించకండి. ప్రొఫైల్ స్థానంలో వాట్సప్ లోగో ఉంటుంది కానీ ఒరిజినల్‌ లోగో మాదిరి ఉండదు.

 

 స్టేటస్ స్థానంలో 'Hey there! I'm using WhatsApp' అని ప్రత్యేకమైన ఫాంట్‌తో ఉన్నట్లయితే అది దాదాపుగా నకిలీ అకౌంటే అవుతుంది. కాబట్టి ఇటువంటి వాట్సాప్ అకౌంట్స్‌ను నకిలీవిగానే పరిగనించడం మంచిది. +44 నెంబర్‌తో వచ్చే వాట్సాప్ మెసెజ్‌లను కూడా నకిలీవిగానే పరిగణించాల్సి ఉంటుంది. Fw calls అనే U.K బేసిడ్ వెబ్‌సైట్ ద్వారా ఈ +44 వాట్సాప్ నెంబర్స్ జనరేట్ అవుతుంటాయి.  కొన్ని సందర్భాల్లో ఫేక్ వాట్సాప్ అకౌంట్‌లను గుర్తించటం చాలా కష్టమౌతుంది అలాంటప్పుడు గుర్తు తెలియని వాట్సాప్ అకౌంట్ నెంబర్ల‌తో చాట్ చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: