నేడు స్మార్ట్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించలేం. అరచేతిలో ఒదిగి అన్ని పనులకూ ఇదే కీలకంగా మారిపోయింది. అయితే చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు నేడు ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య బ్యాటరీ బ్యాక‌ప్. ఎంత పెద్ద బ్యాట‌రీ ఉన్న ఫోన్ వాడినా ఎక్కువ బ్యాక‌ప్ రావ‌డం లేద‌ని చాలా మంది కంప్లెయింట్ చేస్తుంటారు.  4000ఎంఎహెచ్‌, 5000 ఎంఎహెచ్‌ వంటి భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీలు ఉన్నప్పటికీ ఇలా చీటికిమాటికి ఛార్జింగ్‌ పెట్టాల్సి రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక చార్జింగ్ పెట్టి బ్యాటర్ పవర్ 100 శాతం నిండిన తర్వాత తీసేయగా, కొంత సేపటికే ఖర్చయిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. 

 

అయితే ఫోన్లలో బ్యాటరీ బ్యాకప్ పెంచుకునేందుకు, అనవసర వృథాను తగ్గించేందుకు కొన్ని టిప్స్ ఫాలో అయితే స‌రిపోతుంది. అవేంటో చూడండి. బ్యాటరీ చార్జ్ దిగపోవటానికి గల ప్రధాన కారణాల్లో స్క్రీన్ బ్రైట్నెస్ కూడా ఒకటి. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలు పెద్దవిగా ఉండటంతో ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. కాబ‌ట్టి స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను అవసరానికి సరిపడా ఎంపిక చేసుకుంటే.. బ్యాటీరీ పవర్ కొంత మేర ఆదా అవుతుంది. మీ ఫోన్లోని చాలా యాప్స్ మీరు ఏ ప్రదేశంలో ఉన్నారన్న సమాచారం కోసం తరచుగా ట్రాక్ చేస్తూనే ఉంటాయి. దీంతో బ్యాటరీ పవర్ వృథాగా ఖర్చవుతుంటుంది. అందుకే ప్రత్యేకంగా లొకేషన్ అవసరం ఉంటే తప్ప దాన్ని ఎప్పుడూ ఆఫ్ లోనే ఉంచండి.

 

అదే విధంగా, మీ స్మార్ట్‌ఫోన్‌లోని వై-ఫై ఇంకా బ్లూటూత్ ఆప్షన్‌లను అవసరం మేరకే ఉపయోగించుకోండి. అవసరం లేనప్పటికి చాలా మంది వీటిని ఆన్ చేసి ఉంచుతారు. కాబట్లి ఆయా కనెక్టువిటీ అప్లికేషన్ లతో పని పూర్తికాగానే ఆఫ్ చేయటం మంచిది. తద్వారా మీ బ్యాటరీ లైఫ్ మరింత ఆదా అవుతుంది. ఇక యాప్స్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవడం ద్వారా ఫోన్ బ్యాటరీ పవర్ ను ఆదా చేసుకోవచ్చు. మ‌రియు ప్రతీ మొబైల్ లో బ్యాటరీ సెట్టింగ్స్ లోనే పవర్ ను ఆదా చేసే ఆప్షన్లు ఉంటాయి. వీటిని గుర్తించి యాక్టివేట్ చేసుకోవాలి. దీనివల్ల బ్యాటరీ వృధా కాకుండా ఉంటుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: