ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్ యూజర్లను ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఓవర్‌హీట్‌. గేమ్స్‌ ఆడినపుడు, వీడియోలు చూసినపుడు చేతిలోని స్మార్ట్‌ఫోన్ ఎలా హీట్ ఎక్కుతుందో.. ల్యాప్‌టాప్ కూడా హీటెక్కుతుంది. ఇక ల్యాప్‌టాప్‌ వాడకం బాగా పెరిగింది. కోరుకున్న చోటా కోరుకున్న తీరుగా కూర్చొని పని చేసుకునే అవకాశం మనకు ల్యాప్‌టాప్‌ ద్వారా ఉంది. విద్యార్థులు మొదలుకుని జాబ్ ప్రొఫెషనల్స్ వరకు ల్యాప్‌టాప్‌లను అనేక విధాలుగా వాడుకుంటున్నారు. ల్యాప్‌టాప్ డెస్క్‌టాప్‌ కన్నా చాలా చిన్నదిగా ఉంటుంది ఎక్కడికైనా తీసుకొని వెళ్ళడానికి సౌకర్యంగా ఉంటుంది.

 

అయితే ల్యాప్‌టాప్‌లకు ఓవర్ హీటింగ్ సమస్య కొరకరాని కొయ్యగా మారింది. ఈ సమస్యకు సరైన పరిష్కార మార్గాన్ని తయారీదారులు కొనుగొనే లేకపోతున్నారు. ల్యాప్‌టాప్‌లలో తలెత్తే ఓవర్ హీటింగ్ డివైస్ హార్డ్‌వేర్ ఫెయిల్యూర్‌కు కారణమయ్యే ప్రమాదముంది. ఓవర్ హీటింగ్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ల్యాప్‌టాప్ జీవితకాలమే దెబ్బతింటుంది. సో.. ఓవ‌ర్‌హీట్ అవుతున్న ల్యాప్‌టాప్ చ‌ల్ల‌బ‌ర‌చ‌డం ఎలాగో తెలుసుకుందాం. మీ ల్యాప్‌టాప్ కూల్‌గా ఉండాలంటే ల్యాప్‌టాప్‌ను ఉంచే ప్రదేశం చదునుగా ఇంకా ధృడంగా ఉండాలి. టేబుల్ ఇందుకు కరెక్టుగా సూట్ అవుతుంది. మంచం మీద అస్స‌లు కాదు.

 

ల్యాప్‌టాప్ నిరంతరం కూల్‌గా ఉండాలంటే లోపల పేరుకుపోయే దుమ్మును ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుండాలి. ల్యాప్‌టాప్ ఓవర్ హీటింగ్‌కు ప్రధాన కారణం లోపలి కూలింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటమే. ఫ్యాన్‌లో దుమ్ము అమితంగా పేరుకుపోవటం వల్ల గాలి బ్లాక్ అయిపోతుంది. ఈ కారణంగా గాలి వ్యవస్థ పూర్తిగా స్తంభించి హీటింగ్ సమస్య ఉత్పన్నమవుతుంది. కాబ‌ట్టి కూలింగ్ ఫ్యాన్‌లో పేరుకుపోయిన దుమ్మును క్లీన్ చేయటం ద్వారా హీటింగ్ సమస్యను అధిగమించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: