చైనాకు చెందిన దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో మరో బడ్జెట్ ఫోన్ ను భారత్ మార్కెట్ లోకి తీసుకొచ్చింది... ఒప్పో ఏ31 ఫోన్ ను గురువారం నేడు భారత్ మార్కెట్ లో విడుదల చేసింది.. ఎన్నో మార్పులను జోడించి ఏ31 తయారు చేశారు. దీనికి ట్రిపుల్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. అయితే ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది.. అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.11,490గా ఈ ఒప్పో సంస్థ నిర్ణయించింది. 

 

ఒప్పో ఏ31 ఫీచర్లు.. 

 

ఒప్పో ఏ31 ఆండ్రాయిడ్‌ 9పై, కలర్‌ ఓఎస్‌ 6.1.2 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది. 

 

6.5 అంగుళాల హెచ్‌డీ+(720X1,600పిక్సెల్‌) డిస్‌ప్లే, 

 

అక్టాకోర్‌ మీడియా టెక్‌ హీలియో పీ35 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌, 

 

వెనక వైపున ట్రిపుల్‌ కెమెరా 12 మెగాపిక్సెల్‌, 

 

2 ఎంపీ డెప్త్‌ షూటర్‌, మరొకటి 2ఎంపీ మాక్రో కెమెరా 

 

సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్‌ కెమెరా, 

 

4,230 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ,

 

మైక్రో యూఎస్‌బీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌, 

 

4జీ వీఓఎల్టీఈ కనెక్టివిటీ సదుపాయం. 

 

ఇంకా ఈ ఫోన్ ధరలు ఇలా ఉన్నాయి.. 

 

4జీబీ/64జీబీ వేరియంట్‌ ధర రూ.11,490. 

 

6జీబీ/128జీబీ వేరియంట్‌ ధర రూ.13,990.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: