సాధార‌ణంగా ఎవరైనా కొత్త స్మార్ట్ ఫోన్ కొనగానే పక్కనవాళ్లు అడిగే ప్రశ్నలు రెండే.. ఫోన్ ఎంత? స్పెషాలిస్ ఏంటి..? వాస్త‌వానికి మన దైనందిన జీవితంలో ఎక్కడికి వెళ్లినా మనతో ఉండేది ఈ స్మార్ట్ ఫోనే. అస‌లు ఫోన్ లేనిదే కాలు కూడా బ‌య‌ట పెట్ట‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక స్మార్ట్ ఫోన్ల మార్కెట్ రోజురోజుకీ మారిపోతుంది. ఒకప్పుడు బడ్జెట్ రంగానికే పరిమితమైన ఈ పోటీ క్రమంగా అన్ని విభాగాలకూ విస్తరించింది. అంతేకాకుండా, ప్రతి హ్యాండ్‌సెట్‌ లోనూ, రాబోయే టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని పొందుపరుస్తున్న ఫీచర్ల కారణంగా వినియోగదారులలో కూడా అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే మార్చిలో విడుద‌ల కానున్న కొత్త స్మార్ట్ ఫోన్లు.. వాటి స్పెషాలిటీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

రెడ్ మీ నోట్ 9 సిరీస్.. రెడ్ మీ 9, రెడ్ మీ నోట్ 9, నోట్ 9ప్రో సిరీస్ ఈ మార్చిలోనే విడుదుల కానున్న‌ట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇందులో రెడ్ మీ నోట్ 9 ప్రో మిడ్ రేంజ్ 800 సిరీస్ డైమండ్ ప్రాసెసర్ కలిగిన 5జీ సపోర్ట్ తో, రెడ్ మీ నోట్ 9 క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720G ప్రాసెసర్ తో రానున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720G ప్రాసెసర్ ఇస్రో నావిగేషన్ టెక్నాలజీ నావిక్ ను సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఈ ఫోన్ నావిక్ టెక్నాలజీతో లాంచ్ అయ్యే  ఛాన్స్ ఉంది.

 

రియల్ మీ తన రియల్ మీ 6, రియల్ మీ 6 ప్రో స్మార్ట్ ఫోన్లను మార్చి 5వ తేదీన అఫీషియల్ గా లాంచ్ కాబోతుందని ఇప్ప‌టికే ప్రకటించింది.  90 హెర్ట్జ్‌ ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, 30W ఫ్లాష్ చార్జ్ సపోర్ట్ ఫీచర్లను ఈ 6 సిరీస్ ఫోన్లలో అందించనున్నట్లు రియల్ మీ తెలిపింది. మ‌రియు  64 మెగా పిక్సెల్స్ కెమరాతో కూడిన క్వాడ్ కెమరా సెటప్ కలిగి, 20x హైబ్రిడ్ జూమ్ సపోర్ట్ తో రానున్నాయి. వీటిలో రియల్ మీ 6 ప్రో డ్యూయల్ పంచ్-హోల్ సెటప్ తో రానుంది. 

 

వివో తన వి-సిరీస్ లో లాంచ్ చేయనున్న వివో వీ19, వివో వీ19 ప్రో స్మార్ట్ ఫోన్లు కూడా త్వరలోనే లాంచ్ కానున్నాయి. వీటి గురించిన ఎటువంటి వివరాలు పూర్తిగా తెలియనప్పటికీ వివో వీ19 ప్రోలో మాత్రం పాపప్ డ్యూయల్ సెల్ఫీ కెమరా ఉంది. ఐపీఎల్ స్పాన్సర్ షిప్ కూడా వివో వద్దనే ఉన్నందున ఆలోపే ఈ వివో వీ19 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ క్ర‌మంలోనే ఇవి మార్చి రెండో వారంలో రానున్నాయని లీకుల ద్వారా తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్లే కాకుండా మార్చిలో మ‌రిన్ని స్మార్ట్‌ఫోన్లు విడుద‌ల కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: