ఇటీవ‌ల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం అనేది క్రమంగా పెరిగిపోతుంది. ప్రతీ ఒక్కరు వ్యాపార, ఉద్యోగ, కుటుంబ, వ్యక్తిగత అవసరాల కోసం స్మార్ట్ ఫోన్ ని ఎంచుకుంటున్నారు. ఇక మొబైల్ తయారి సంస్థలు కూడా తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ లను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా ఇండియా మార్కెట్లో ఎన్నో కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ఏది కొనాలి..? మ‌న‌కు ఏ ఫోన్ సూట్ అవుతుంది..? అన్నది తెలుసుకోవ‌డం చాలా క‌ష్టం. అలాంట‌ప్పుడు ఇప్పుడు చెప్పుకోబోయే టిప్స్ బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

 

మీరు ఎంపిక చేసుకునే ఫోన్ డిజైన్ ముందు చూడటానికి కంఫర్ట్ గా ఉండాలి. పాకెట్ ఫ్రెండ్లీగా ఉండాలి. అదే సమయంలో మన్నిక కూడా ఎంతో అవసరం. ముఖ్యంగా అవుట్ డోర్ వాతావరణాలను మీ ఫోన్ తట్టుకునేంత సామర్థ్యాలను కలిగి ఉండాలి. ప్రొఫెషనల్ డీఎస్ఎల్ఆర్ కెమెరా ఫోటోగ్రఫీకి ధీటుగా స్మార్ట్‌ఫోన్ కెమెరా టెక్నాలజీ అభివృద్థి చెందుతోంది. మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ ఉత్తమ క్వాలిటీ ఫోటోలను ఉత్పత్తి చేయాలంటే 5 అంతకన్నా ఎక్కువ మెగా పిక్సల్ సామర్థ్యాన్ని మీ ఫోన్ కలిగి ఉండాలి.

 

ప్ర‌స్తుతం భారత్‌లో 2జీ, 3జీ, 4జీ ఇంటర్నెట్ కనెక్టువిటీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. సాధ్యమైనంత వరకు మీ ఫోన్ 4జీ ఇంటర్నెట్ కనెక్టువిటీని సపోర్ట్ చేసేదిగా ఉంటే చాలా బెట‌ర్‌. మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఫిట్నెస్ ట్రాకర్ వంటి అదనపు ఫీచర్లుంటే ఇంకా మంచిది. అంతేకాకుండా.. మీ స్మార్ట్‌‌ఫోన్‌లో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయంటే బ్యాటరీ బ్యాకప్ అంత త్వరగాతగ్గిపోతుందని అర్థం. కాబట్టి సింగిల్ చార్జ్ పై ఒకటి రెండు రోజులు బ్యాకప్‌నిచ్చే స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకోవ‌డం చాలా ముఖ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: