సాధారణంగా గూగుల్ పే యాప్ వినియోగించే కస్టమర్లు యాప్ ఓపెన్ చేసి బ్యాంక్ బ్యాలెన్స్ ను చెక్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం గూగుల్ పే లో చెక్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ కనిపించటం లేదు. ఆప్షన్ కనిపించకపోవడంతో చాలామంది గూగుల్ పే వినియోగదారులు బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియక కంగారు పడుతున్నారు. గూగుల్ పే బ్యాలెన్స్ చెకింగ్ ఆప్షన్ ను తొలగించింది. 
 
గూగుల్ పే వినియోగదారులు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటే మొదట ప్రొఫైల్ పిక్ పై క్లిక్ చేయాలి. ప్రొఫైల్ పిక్ పై క్లిక్ చేయగానే పేమెంట్ మెథడ్స్ అనే ఆప్షన్ వస్తుంది. అందులో బ్యాంక్ అకౌంట్, పేరు వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే యాక్టివేట్ అకౌంట్ నంబర్ అని చూపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి వ్యూ బ్యాలెన్స్ ఆప్షన్ ను ఎంచుకుని పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే బ్యాలెన్స్ వివరాలు తెలుస్తాయి. 
 
తాజాగా ఆర్బీఐ యస్ బ్యాంకుకు కొన్ని షరతులు విధించటంతో ఆ ప్రభావం గూగుల్ పే పై పడింది. గూగుల్ పే యాప్ లో కొన్ని లావాదేవీలు జరుగుతుండగా... కొన్ని లావాదేవీలు మాత్రం పెండింగ్ లో పడుతున్నాయి. గూగుల్ పే యూజర్లు సర్వర్ కు లోడ్ ఎక్కువై లావాదేవీలు ఫెయిల్ అవుతున్నట్లు చెబుతున్నారు. యస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభంతో ఫోన్ పే ద్వారా లావాదేవీలు నిలిచిపోవడంతో దాని ప్రభావం గూగుల్ పే పై పడింది. గూగుల్ పే ఇప్పటివరకూ దీనిపై స్పందించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: