ఇటీవ‌ల కాలంలో రోజుకో  స్మార్ట్ ఫోన్‌ మార్కెట్లో కి సంద‌డి చేస్తోంది. అడక్కుండా అంతేసి డిస్కౌంట్.. అది కూడా మనసు దోచే ఫీచర్లతో వ‌స్తే.. ఖ‌చ్చితంగా ఎవ‌రైనా పాత ఫోన్‌ను అమ్మేసి కొత్త ఫోన్‌ను కొనుగోలు చేస్తారు. అయితే మీ ఫోన్ మరొకరి చేతుల్లోకి వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. లేకపోతే మీ ప్రైవసీ రిస్క్‌లో పడే అవకాశముంది.  మరి పాత ఫోన్ అమ్మడం లేదా ఎక్స్‌ఛేంజ్ చేయడం కన్నా ముందు మీరు మర్చిపోకుండా చేయాల్సిన విష‌యాలు ఏంటీ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

 

మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ని గూగుల్‌లోకి బ్యాకప్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫోన్‌లో పెట్టింగ్స్‌ ఓపెన్ చేసి అ్ఔంట్‌ సెక్షన్‌లో గూగుల్ పైన క్లిక్ చేయాలి. మీరు ఏ మెయిల్‌లోకి బ్యాకప్ చేయాలో ఆ మెయిల్‌పైన క్లిక్ చేసి కాంటాక్ట్స్ సింక్ చేయాలి. అలాగే మీ ఫోన్‌లోని డేటాను బ్యాకప్‌ తీసుకోవాలి. మీరు బ్యాకప్ తీసుకునే డేటాలో మీ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, మెసేజెస్, కాంటాక్ట్స్ వంటివి అనేకం ఉంటాయి. మీరు ఇప్పటికే బ్యాకప్ తీసుకోకపోతే, మీ ఫోటోలు, వీడియోలను బ్యాకప్ చేయడానికి గూగుల్ ఫోటోస్, గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ వంటి క్లౌడ్ ఆధారిత సేవలను ఉపయోగించుకోవచ్చు.

 

అలాగే ఫోన్ రీసెట్ చేసిన తర్వాత వెంటనే స్విచ్ఛాఫ్ చేయండి. అకౌంట్ లాగిన్ చేయకుండా ఫోన్ వాడితే ఏం కాదనుకోవద్దు. వైఫైకి కనెక్ట్ చేసి ఉపయోగించొద్దు. మీ పాత ఫోన్ నుంచి సిమ్ కార్డ్, మొమొరీ కార్డ్‌తో పాటు ఇతర యాక్సెసరీస్ ఏవైనా ఉంటే తీసెయ్యాలి. అదేవిధంగా, మీరు మీ మొత్తం డేటాను మొబైల్ నుండి తీసివేసి, బ్యాకప్‌ క్రియేట్ చేసిన తర్వాత, మీరు మీ మొబైల్ ను ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మంచిది. దీంతో మీరు మీ మొబైల్లో సైన్ ఇన్ చేసిన అన్ని అకౌంట్స్ తొలగించగలుగుతారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: