టెలికం రంగంలో అడుగు పెడుతూనే జియో సంచలనం సృష్టించింది. అన్ని ఫ్రీ అంటూ వ‌చ్చిన జియో యూజ‌ర్ల‌కు ఒక్క‌సారిగా త‌న‌వైపు తిప్పుకుంది. ఇలా టెలికం రంగంలోకి ప్రవేశించి తక్కువ డేటా ఆఫర్లతో యూజర్లను ఆకర్షించి అతి త‌క్కువ స‌మ‌యంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరింది రిలయన్స్ జియో. ఇక గతేడాది డిసెంబర్ లో టారిఫ్ ల పెంపు జరిగిన తర్వాత జియో అన్ని విభాగాల్లో తక్కువ ప్లాన్లనే అందిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఎయిర్ టెల్, వొడాఫోన్ లు వివిధ రకాలైన లాభాలతో ఎన్నో ప్లాన్లను అందిస్తుంటే జియో మాత్రం.. అన్ని విభాగాల్లో తక్కువ సంఖ్యలోనే మంచి ప్లాన్లను అందిస్తూ వినియోగదారులను ఆక‌ర్షిస్తోంది.

 

ఇక తాజాగా రిలయెన్స్ జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. లాంగ్ టర్మ్ టారిఫ్ ప్లాన్ ఇది. రూ.4,999 ఒకేసారి రీఛార్జ్ చేస్తే ఏకంగా 360 రోజుల వేలిడిటీ లభిస్తుంది. లాంగ్ టర్మ్ యూజర్లకు ఈ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. 2017లో ఈ ప్లాన్‌ను జియో ప్రవేశపెట్టినా.. ఆ తరువాత ఈ ప్లాన్‌ను రద్దు చేసింది. ప్రస్తుతం ఇదే ప్లాన్‌ను జియో మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ద్వారా జియో మొత్తంగా 350 జీబీ డేటాను అందించనుంది.

 

ఈ డేటాను మీరు ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. అంటే ఓరోజు 500 ఎంబీ, మరో రోజు 1 జీబీ, ఇంకో రోజు 2జీబీ... ఇలా మీకు ఏ రోజు ఎంత అవసరం అయితే అంత డేటా ఉపయోగించుకోవచ్చు. ఈ 350 జీబీ డేటా అయిపోయాక ఇంటర్నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్ కు పడిపోతుంది. జియో నుంచి జియోకు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 12,000 ఉచిత నిమిషాలను అందించనున్నారు. మ‌రియు ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 100ఎస్‌ఎంఎస్‌లు కూడా లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: