ప్ర‌స్తుతం స్మార్ట్ ఫోన్ జనరేషన్ న‌డుస్తోంది. ఇక చాలా మంది స్మార్ట్ ఫోన్ ని ఎక్కువగా ఫోటోలను తీసేందుకు వాడుతున్నారు. ఎన్నో మధుర ఘట్టాలను, అందమైన దృశ్యాలను బంధించి చిరస్మరణీయంగా ఉంచడంలో స్మార్ట్ ఫోన్ కెమెరా ప్రధాన పాత్ర పోషిస్తోంది. మీ స్మార్ట్ ఫోన్ లో ఇమిడిపోయిన కెమెరాను ఎంత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు...? ఫొటోలను అందంగా ఎలా చిత్రీకరించవచ్చు..? అన్న‌ది చాలా మందికి అవ‌గాహ‌న ఉండ‌దు. ఏదో కెమెరా ఓపెన్ చేసి.. ఫోటో తీసాం అయిపోయింది. అంతే అనుకుంటారు. కానీ, ఫోటో తీయ‌డం కూడా ఓ క‌లే.



ఫోటో అందంగా, అద్భతంగా తీయాలంటే ఖ‌చ్చితంగా కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వాల్సిందే. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి. మీ స్మార్ట్‌ఫోన్‌తో అత్యుత్తమ సెల్ఫీలను పొందేందుకు సెల్ఫీ స్టిక్స్‌ను ఉపయోగించుకోవాలి. మీ ఫోన్ ద్వారా చిత్రీకరించిన ఫోటోలను కావల్సిన రీతిలో ఎడిట్ చేసుకునేందుకు రకరకాల ఫోటో ఎడిటింగ్ యాప్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటిలో మంచి వాటిని ఎంపిక చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకుంటే.. తీసిన ఫోటోస్‌ను మ‌న‌కు న‌చ్చిన విధంగా మార్చుకోవ‌చ్చు.



ఫొటోలు తీసే విషయంలో ఓపిక చాలా అవసరం. ఓ కార్యక్రమం జరుగుతోంది. అందులో అద్భుతమైన క్షణాలను కెమెరాలో బంధించాలంటే అనుక్షణం వేచి చూడాలి. భావోద్వేగాలు, ఆశ్చర్యం, అద్భుతం, విస్మయం కనిపించిన వెంటనే బంధించాలి. అలాగే బెటర్ క్వాలిటీ ఫోటో కోసం కెమెరాలో సెట్టింగ్స్‌లోని ఎక్కువ రిసల్యూషన్‌ను సెట్ చేసుకోండి. ఇక మీ ఫోన్‌లోని కెమెరా సెట్టింగ్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి. ఇలా చేయటం ద్వారా ఫోన్ కెమెరా సామర్థ్యం ఎంతో మీకు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: