షియోమీ ప్రియుల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్‌. షియోమీ చరిత్రలో అత్యంత విజయవంతమైన రెడ్ మీ నోట్ సిరీస్ లో కొత్త స్మార్ట్‌ఫోన్ వ‌చ్చేసింది. రెడ్‌మీ నోట్ 9 సిరీస్ మార్చి 12వ తేదీన భారతదేశంలో లాంచ్ అవుతుందని షియోమీ ఇప్ప‌టికే వెల్లడించింది. ఇక అనుకున్న‌ట్టుగానే భార‌త్‌లో  రెడ్‌మీ నోట్ 9 సిరీస్ రిలీజ్ అయింది. ఈ సిరీస్‌లో రెడ్‌‌మీ నోట్ 9 ప్రో, రెడ్‌‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది షావోమీ. కరోనా వైరస్ ప్రభావంతో షావోమీ ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా ఈ రెండు ఫోన్లను ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది.

 

ఇక రెడ్‌మీ నోట్ 9 ప్రో, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి.  స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాససెర్, 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 5020 ఎంఏహెచ్ ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి కామన్ ఫీచర్స్ ఉన్నాయి. అయితే రెడ్‌మీ నోట్ 9 ప్రో 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.  రెడ్‌మీ నోట్ 9 ప్రో 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. ప్రారంభ ధర రూ.12,999. మార్చి 17న సేల్ ప్రారంభమవుతుంది. రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. ప్రారంభ ధర రూ.14,999. మార్చి 25న సేల్ ప్రారంభమవుతుంది. 

 

స్పెసిఫికేష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. 
రెడ్‌‌మీ నోట్ 9 ప్రో:
డిస్‌ప్లే-  6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 2400x1080 పిక్సెల్స్
ఇంటర్నల్ స్టోరేజ్- 64జీబీ, 128జీబీ
ర్యామ్- 4జీబీ, 6జీబీ
ప్రాసెసర్- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ
బ్యాటరీ- 5020 ఎంఏహెచ్
ఫ్రంట్ కెమెరా- 16 మెగాపిక్సెల్ ఇన్ డిస్‌ప్లే  కెమెరా
రియర్ కెమెరా- 48 (ప్రైమరీ)+8 (వైడ్ యాంగిల్)+5 (మ్యాక్రో)+2 (డెప్త్) మెగాపిక్సెల్
ధర- 4జీబీ+64జీబీ- రూ.12,999 6జీబీ+128జీబీ- రూ.15,999.

 

రెడ్‌‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్:
డిస్‌ప్లే-  6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 2400x1080 పిక్సెల్స్
ఇంటర్నల్ స్టోరేజ్- 64జీబీ, 128జీబీ
ర్యామ్- 6జీబీ, 8జీబీ
ప్రాసెసర్- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ
బ్యాటరీ- 5020 ఎంఏహెచ్
ఫ్రంట్ కెమెరా- 32 మెగాపిక్సెల్ ఇన్ డిస్‌ప్లే కెమెరా
రియర్ కెమెరా-  64 (ప్రైమరీ)+8 (వైడ్ యాంగిల్)+5 (మ్యాక్రో)+2 (డెప్త్) మెగాపిక్సెల్
ధ‌ర‌- 6జీబీ+64జీబీ- రూ.14,999 6జీబీ+128జీబీ- రూ.16,999 8జీబీ+128జీబీ- రూ.18,999.

మరింత సమాచారం తెలుసుకోండి: