ఇటీవ‌ల కాలంలో రోజుకో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వ‌చ్చి జ‌నాల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో అల‌రిస్తున్నాయి. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. కొత్త ఫోన్ కొనాల‌నుకుంటున్న వారింద‌రికి ఓ గుడ్ న్యూస్‌. వివో ఇటీవల ఇండోనేషియాలో వీ19 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మ‌రియు కొన్ని రోజుల్లో మలేషియాలో కూడా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు వివో ప్ర‌క‌టించింది. అయితే కొన్ని లీకుల ప్ర‌కారం అతి త్వ‌ర‌లోనే ఇండియాలోనూ  వీ19 స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

 

ఇక వివో మలేషియా సామాజిక మాధ్య‌మాల్లో వచ్చిన అధికారిక టీజర్ ప్రకారం వివో వీ19లో డ్యూయల్ హోల్-పంచ్ సెల్ఫీ కెమెరాలు ఉంటాయి. అలాగే ఈ ఫోన్ లో లైట్ ఫొటోగ్రఫీపై కూడా ఎక్కువ దృష్టి పెట్టనుంది. అలాగే ఈ ఫోన్ ముందు రెండు సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుందని స‌మాచారం. ఇండోనేషియా మార్కెట్లో లాంచ్ చేసిన వివో వీ19 బ‌ట్టీ చూస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ 6.44-అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోలెడ్ పంచ్-హోల్ డిస్ ప్లేను అందించారు. 

 

దీని పిక్సెల్ రిజల్యూషన్ 2340x1080 కాగా, యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంటుంది. అలాగే వివో వీ19 స్మార్ట్ ఫోన్ లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. క్వాల్ కాం స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఆన్‌బోర్డ్ మెమరీతో పనిచేస్తుంది. అదేవిధంగా, శాంసంగ్ జీడబ్ల్యూ1 48 మెగాపిక్సెల్ సెన్సార్ ను ఇందులో ప్రధానకెమెరాగా అందించారు. L-ఆకారపు సెటప్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఇందులో ప్రధాన ఆకర్షణ.   

మరింత సమాచారం తెలుసుకోండి: