ఇటీవ‌ల కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఏ రేంజ్‌లో పెరిగిపోయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న వారింద‌రికీ బ్లూటూత్, వై-ఫై‌ల గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌రియు టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్లూటూత్, వై-ఫై‌ అనేది ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది. కానీ, చాలా మందికి ఈ రెండిటిపైనా అవ‌గాహ‌న లేక‌పోవ‌చ్చు. ముఖ్యంగా బ్లూటూత్, వై-ఫై‌ల మధ్య తేడాలేంటో కూడా తెలియ‌క‌పోవ‌చ్చు. అలాంటి వారికి ఇప్పుడు ఖ‌చ్చితంగా స‌మాధానం దొరుకుతుంది.

 

రెండు డివైజ్‌ల మధ్య నిర్ణీత దూరం వరకు వైర్లసాయం లేకుండా సమాచారాన్ని షేర్ చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ‘బ్లూటూత్'గా వ్యవహరించుకుంటున్నాం. బ్లూటూత్ కనెక్షన్ 10 మీటర్ల పరిధి వరకు స్పందించగలదు. అలాగే బ్లూటూత్ అప్లికేషన్ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ తదితర కమ్యూనికేషన్ పరికరాల్లోకి వ్యాప్తి చెందింది. మీ ఫోన్‌లోని బ్లూటూత్ ఫీచర్ ద్వారా మీరు పంపబోయే ఫైల్‌ను స్వీకరించే డివైజ్ ఖచ్చితంగా బ్లూటూత్ ఫీచర్‌ను కలిగి ఉన్నదై ఉండాలి.

 

ఇక వైఫై విష‌యానికి వ‌స్తే.. ఈ వ్యవస్థకు చేరువలో ఉన్న ఎన్ని పరికరాలనైనా కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో సమాచారన్ని మరింత వేగవంతంగా షేర్ చేసుకోవచ్చు. వై-ఫై వ్యవస్థలో 2.4గిగాహెట్జ్ నుంచి 5గిగాహెట్జ్ వరకు ఫ్రీక్వెన్సీ రేంజ్ గల రేడియో తరంగాలను వినియోగిస్తారు. అలానే, వై-ఫై స్థావరం పరిధిలో సెక్యూరిటీ కోడ్ నిబంధన లేనట్లయితే ఏ వై-పై ఆధారిత పరికరమైనా ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు. అదేవిధంగా, వై-ఫై వ్యవస్థ 100 మీటర్ల పరిధి వరకు స్పందించగలదు

మరింత సమాచారం తెలుసుకోండి: