చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీ రియల్‌మీ భారత మార్కెట్‌లోకి రియల్‌మీ 6 సిరీస్‌ను కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన‌ సంగతి తెలిసిందే.  గతంలో తీసుకొచ్చిన రియల్‌మీ 5, 5ప్రోకు కొనసాగింపుగా రియల్‌మీ 6, రియల్‌మీ 6ప్రో ఫోన్లను విడుదల చేసింది. ఇప్పుడు రియల్‌మీ 6 సిరీస్‌లోనే మరో ఫోన్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. రియల్‌మీ 6ఐ మోడల్‌ని మియన్మార్‌లో ఆవిష్కరించింది. రియల్‌మీ 5ఐ అప్‌గ్రేడ్ వర్షన్ ఇది. 

 

రియల్‌మీ 6ఐ ప్రస్తుతం మియన్మార్ మార్కెట్‌లోనే రిలీజ్ అయింది. ఇండియాతో పాటు ఇతర దేశాల్లో ఈ ఫోన్ రిలీజ్ అవుతందా లేదా అన్న స్పష్టత లేదు. రియల్‌మీ 5ఐ అప్‌గ్రేడ్ వర్షన్ ఇది. మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. వైట్ మిల్క్, గ్రీన్ టీ క‌ల‌ర్స్‌లో రియల్‌మీ 6ఐ అందుబాటులో ఉంది.

 

ఇక రిమ‌ల్‌మీ 6ఐ ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. 
- 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ, 720 x 1600 పిక్సెల్స్ డిస్‌ప్లే
- 64జీబీ, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 3జీబీ, 4జీబీ ర్యామ్
- మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్
- 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా

 

- 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
-  5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
- ఆండ్రాయిడ్ 10+రియల్‌మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్
- 3జీబీ+64జీబీ సుమారు ధ‌ర‌ రూ.13,000
- 4జీబీ+128జీబీ సుమారు ధ‌ర‌ రూ.15,600

మరింత సమాచారం తెలుసుకోండి: