దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం కరోనా బాధితుల సంఖ్య 223కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేయడానికి పలు చర్యలు చేపట్టాయి. 
 
రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్ బుక్ సంస్థకు చెందిన వాట్సాప్ ఇన్ఫర్మేషన్ హబ్ ను ప్రారంభించింది. కరోనా వైరస్ కు సంబంధించిన సమాచరాన్ని ఈ ఇన్ఫర్మేషన్ హబ్ ద్వారా యూజర్లు తెలుసుకోవచ్చు. సంస్థ ప్రతినిధులు whatsapp.com లో కరోనాకు ఇన్ఫర్మేషన్ హబ్ ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. 
 
యూఎన్‌డీపీ, యూఎన్‌సీఎఫ్, డబ్ల్యూహెచ్‌వో కలిసి ఈ ఇన్ఫర్మేషన్ హబ్ ను ప్రారంభించాయి. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సంబంధించిన సూచనలు ఇందులో ఉంటాయి. వాట్సాప్ కరోనా వ్యాప్తిని తగ్గించటానికి చర్యలు చేపట్టటం పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ ద్వారా ప్రజలకు కచ్చితమైన సమాచారం తెలిసే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: