ప్ర‌పంచ వ్యాప్తంగా శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోన్న క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌భుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్  త‌న క‌స్ట‌మ‌ర్ల కోసం అదిరిపోయే ఆఫ‌ర్ ఇచ్చింది. క‌రోనాకు నేప‌థ్యంలో ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తి ఒక్క‌రు ఇంటినుంచే వ‌ర్క్ ఫ్రం హోం చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలోనే అటు సాఫ్ట్‌వేర్ నిపుణుల‌తో పాటు ప్ర‌తి ఒక్క‌రు ఇంటి నుంచే వ‌ర్క్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బీఎస్ఎన్ఎల్ త‌న ల్యాండ్ లైన్ వినియోగ‌దారుల‌కు ఉచితంగా నెల రోజులు పాటు ఈ సేవలను అందించనుంది.



ఈ ప్లాన్ ద్వారా 10 ఎంబీపీఎస్‌ఎస్ డౌన్ స్పీడ్‌ను,  రోజుకు 5 జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తుంది.  ఒకవేళ డేటా పరిమితి అయిపోతే, డేటా వేగం 1 ఎంబీపీఎస్‌కు పరిమితమవుతుంది. ఉచిమ‌న దేశంలో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఉండి... బ్రాండ్ బ్యాండ్ లేని వారి అంద‌రికి కూడా బ్రాడ్‌బ్యాండ్ సేవను ఒక నెల తంగా అందిస్తున్నామ‌ని... దీంతో వారంతా ఓ నెల రోజుల పాటు ఇంటి నుంచే ప‌ని చేసుకోవ‌చ్చ‌ని బీఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ సిఎఫ్ఎ వివేక్ బంజాల్ చెప్పారు.

 


ఇక ఈ సౌక‌ర్యం వ‌ల్ల ఇంట్లో నుంచే కిరాణాను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసుకోవ‌చ్చ‌ని కూడా ఆయ‌న తెలిపారు. ఇదిలా ఉంటే ల్యాండ్ లైన్ వినియోగ‌దారుల‌ను బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులుగా మార్చేందుకు కూడా ఇది ఉప‌యోగ ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అలాగే ఎయిర్ టెల్‌, జియో లాంటి బ్రాండ్ బ్యాండ్ల నుంచి పోటీ త‌ట్టుకునేందుకు కూడా ఈ ఆఫ‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని కూడా బీఎస్ఎన్ఎల్ అంచ‌నా వేస్తోంది.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: