పోకో ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పోకో ఎఫ్1 అప్‌గ్రేడ్ వర్షన్ పోకో ఎక్స్2 ఇటీవ‌ల విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. పోకో ఎఫ్2 పేరుతో వస్తుందనుకున్న ఫోన్ పోకో ఎక్స్2 పేరుతో ఇండియాలో రిలీజైంది. మూడు వేరియంట్లలో పోకో ఎక్స్‌2 మోడల్‌ను పరిచయం చేసింది పోకో ఇండియా. పోకో ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, VoWifi సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

 

ఇన్నాళ్లూ పోకో ఎక్స్‌2 ఫ్లాష్‌ సేల్‌లో మాత్రమే దొరికేది. అయితే సూపర్ స్పెషల్ సేల్ పేరుతో పోకో ఎక్స్‌2 ఓపెన్ సేల్‌లో అందుబాటులోకి వస్తోంది. మార్చి 19 నుంచి 22 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో జరిగే బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో ఈ ఫోన్‌ను ఓపెన్ సేల్‌లో బుక్ చేసుకోవచ్చు. పోకో ఎక్స్2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ ధర రూ.15,999 కాగా, 6జీబీ+128జీబీ ధర రూ.16,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ+256జీబీ ధర రూ.19,999. ఎస్‌బీఐ కార్డుతో కొనేవారికి రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

 

ఇక పోకో ఎక్స్2 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.67 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. పోకో ఎక్స్2 స్మార్ట్‌ఫోన్ మ్యాట్రిక్స్ పర్పుల్, ఫీనిక్స్ రెడ్, అట్లాంటిస్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. పోకో ఎక్స్2 స్మార్ట్‌ఫోన్ రియర్ కెమెరా 64+8+2+2 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 20+2 మెగాపిక్సెల్. మ‌రియు పోకో ఎక్స్2 స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ 4,500 ఎంఏహెచ్. అయితే సూపర్ స్పెషల్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫ‌ర్ మ‌రి కొన్ని గంట‌లు మాత్రమే మిగిలి ఉంది. కాబ‌ట్టి లేట్ చేయ‌కుండా సేల్ ప్రారంభించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: