కరోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఇప్ప‌టికే 185 దేశాల్లో కరోనా వైరస్ వ్యాపించింది. మృతుల సంఖ్య 11 వేల‌కుపైగా చేరింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 276462 మందికి కరోనా వైరస్ సోకగా... ఇప్పటివరకూ... 91954 మంది వైరస్ నుంచీ కోలుకున్నారు. కరోనా దెబ్బకు ప్రపంచం అబ్బా అంటోంది. దాన్ని నియంత్రించటానికి ఆయా దేశాలు హెల్త్ ఎమర్జన్సీన ప్రకటిస్తున్నాయి అంటే కరోనా తీవ్రత ఏస్థాయిలో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక కరోనా వైరస్ పుట్టిన చైనాలో దాని ప్రభావం తగ్గుముఖం పట్టినా ఇతర దేశాల్లో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ముఖ్యంగా ఇటలీలో కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇలా ప్రపంచంలోని దేశాలను వణికించేస్తూ.. ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా దెబ్బకొడుతోంది. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు బాధిత దేశాలు యుద్ధాన్ని ప్ర‌కటించాయి. ఇదిలా ఉంటే.. కరోనా ప్రభావంతో వర్క్‌ ఫ్రం హోం చేయమని కంపెనీలు అవకాశం ఇచ్చేశాయి. దీంతో ఉద్యోగులంతా ఇంటర్నెట్ డేటాపై ఆధారపడ్డారు. దీంతో ఇంటర్నెట్‌ డాటాకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిందని టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు తెలియజేస్తున్నారు. అటు ఇంటర్నెట్ ట్రాఫిక్‌ పది శాతం పెరిగిందని తెలుసుకున్నారు.

ట్రాఫిక్‌ అనూహ్యంగా పెరగడంలో నెట్‌వర్క్‌ స్తంభించే అవకాశం లేదని, సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌.మ్యాథ్యూస్ తెలిపారు. అలాగే డేటా డిమాండ్‌ పెరిగిన ఫలితంగా సమస్యలు ఎదురుకావని, నెట్‌వర్క్స్‌ అన్నీ ఎంతో సామర్థ్యంతో ఉన్నాయన్నారు. ఆందోళన అవసరం లేదని చెప్పారు. మరోవైపు రిలయన్స్‌ జియో వంటి టెలికాం కంపెనీలు టాప్‌ అప్స్‌కు తగ్గట్టుగా సరికొత్త టారిఫ్‌ ప్యాకేజ్‌ను ఇటీవల లాంఛ్‌ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: