స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు క్రియేట్ చేస్తున్న‌ షావోమీ.. చైనాలో 5జీ సపోర్ట్‌తో రెడ్‌మీ కే30 రిలీజ్ చేసింది. అయితే షియోమీ రేపు తన సబ్ బ్రాండ్ రెడ్ మీ నుంచి అదిరిపోయే ఫ్లాగ్ షిప్ ఫోన్ రానుంది. రెడ్ మీ కే30కి ప్రో వెర్షన్ అయిన రెడ్ మీ కే30 ప్రో స్మార్ట్ ఫోన్‌ను రేపు విడుదల కానుంది. రెడ్‌మీ కే30 ప్రో లాంచ్ మార్చి 24వ తేదీన చైనాలో జరుగుతోంది. కరోనావైరస్ కారణంగా షియోమీ కంపెనీ వీబోలోని అధికారిక రెడ్‌మీ ఖాతా ద్వారా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షప్రసారం నిర్వహిస్తుంది. రెడ్‌మీ కే30 ప్రో స్మార్ట్ ఫోన్ క్వాల్ కాం స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ ద్వారా పని చేయనున్నట్లు లూ గతంలోనే వెల్లడించారు.

ఇక రెడ్‌మీ కే30 ప్రో స్మార్ట్ ఫోన్ హెచ్‌డీఆర్ 10+ డిస్‌ప్లేతో రానుంది ఇటీవల రిలీజ్ అయిన‌ టీజర్‌ల ద్వారా అర్థం అవుతుంది. రెడ్‌మీ కే20 సిరీస్ మాదిరిగానే రెడ్‌మీ కే30 ప్రో కూడా పాప్-అప్ సెల్ఫీ కెమెరాతోనే వస్తుంది. ఇది హోల్-పంచ్ డిస్ ప్లే ఉన్న రెడ్‌మీ కే30 మోడళ్లకు కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో వృత్తాకార కెమెరా మాడ్యూల్లో నాలుగు కెమెరాలను అందించారు. ఇందులో 64-అంగుళాల సోనీ IMX686 సెన్సార్ ను ప్రధాన కెమెరాగా అందించారు. ఇది 1.6 మైక్రాన్ పిక్సెల్ సైజుతో ఉంటుంది. అలాగే రెడ్‌మీ కే30 ప్రోలో  ఎల్‌పీడీడీఆర్ 5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఉంటుంది.

ఈ ఫోన్‌లో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్ కూడా ఉంటాయి. మ‌రియు  వైఫై 6, 4జీ ఎల్టీఈ సపోర్ట్ తో పాటు డ్యూయల్-మోడ్ 5జీ కనెక్టివిటీని కూడా ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా షియోమీ అందిస్తుంది. ఇక ఈ ఫోన్ ఐదు వేర్వేరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. రెడ్‌మీ కే30 ప్రో ధర గురించి షియోమీ ఎలాంటి వివరాలనూ తెల‌ప‌లేదు. కానీ, చైనీస్ ఈ-కామర్స్ సైట్ సునింగ్‌లో ఇటీవల ఈ ఫోన్ కనిపించింది. 3,299 యువాన్ల అంటే ఇండియ‌న్ క‌రెన్సీలో సుమారు రూ. 35,200  ధరతో ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ వస్తుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: