రిలయెన్స్ జియో... టెలికం రంగంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. కంపెనీ ప్రారంభించినాటి నుంచి ఇప్పటికీ జియో సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న రిలయెన్స్ జియో... తెలుగు రాష్ట్రాల్లో మరింత వేగంగా దూసుకెళ్తోంది. ఇప్ప‌టికే అతి తక్కువ ధరకే డేటా ప్యాక్స్‌ను, ఉచిత వాయిస్ కాల్స్‌ను అందిస్తున్న రిలయన్స్ జియో.. తాజాగా త‌మ యూజ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైర‌స్ క‌మ్మేసింది. కరోనా ధాటికి మనదేశంలో దాదాపు అన్ని సంస్థలూ వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ను అందించాయి.

అయితే సడెన్ గా వర్క్ ఫ్రం హోం ఇచ్చేసరికి ఇంట్లో వైఫై కనెక్షన్ లేని వారికి చాలా ఇబ్బంది పాడాల్సి వ‌స్తుంది. ఇలాంటి వారికి జియో గుడ్ న్యూస్ అందించింది. తాజాగా  లాంచ్ చేసిన రూ. 251  ప్లాన్ లో వినియోగదారులు రోజుకు  జీబీ 4జీ డేటాను పొందవచ్చు. 51 రోజుల పాటు ఈ ప్లాన్ చెల్లుబాటులో వుంటుంది. 120 జీబీ దాకా డేటాను వాడుకోవచ్చు. అయితే దీనికి వాయస్ కాల్స్, ఎస్ ఎంఎస్  సేవలు లభించవు. ఇక‌ 100 శాతం డేటా వినియోగం పూర్తయిన తర్వాత, వినియోగదారులు 64 కేబీపీఎస్ తక్కువ వేగంతో ఇంటర్నెట్ డేటాను అపరిమితంగా మిగిలిన రోజులో కూడా ఉపయోగించడం కొనసాగించవచ్చు.

అయితే లిమిట్ దాటిన తరువాత డేటా బ్రౌజింగ్ కుమాత్రమే పరిమితం. వీడియోలు ప్లే కావు. కాగా, క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.  ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 192 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించింది. కరోనా బాధితుల సంఖ్య 3.36 లక్షల మందికి పైగా నమోదు కాగా, 14641 మంది మృతి చెందారు. కరోనా దెబ్బకు ప్రపంచం విల‌విల‌లాడుతుంది.  దాన్ని నియంత్రించటానికి ఆయా దేశాలు హెల్త్ ఎమర్జన్సీన ప్రకటిస్తున్నాయి అంటే కరోనా తీవ్రత ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: