నెగ‌టివ్‌లో పాజిటివ్ అంశ‌మిది. క‌రోనాను ఎలాగు పూర్తిస్థాయిలో క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతున్న ఇండియాకు ఊర‌ట‌నిచ్చే ఓ అంశం ఇది. కోవిడ్‌-19నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌కు ఉప‌యోగించే కిట్‌ను దేశీయ‌సంస్థ త‌యారు చేయ‌డం విశేషం. అది కూడా అతిత‌క్కువ కాలంలో త‌యారు చేసి ఖ‌చ్చిత‌మైన ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తుండ‌టం గ‌మ‌నార్హం. కరోనా మొద‌లైన నాటి నుంచి పుణె పేరు మారుమోగింది. క‌రోనా బాధితుల‌, అనుమానితుల ర‌క్త‌న‌మూనాల‌ను సేక‌రించి మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్ సంస్థ మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు త‌ర‌లించారు. దేశ వ్యాప్తంగా వేలాది మంది ప‌రీక్ష‌ల‌ను ఇక్క‌డ నిర్వ‌హించారు. 

 

అయితే ప‌రిస్థితి చూస్తేంటే ప్ర‌మాద‌క‌రంగా ఉండ‌టం, కిట్స్ స‌రిపోక‌పోవ‌డంతో కేంద్రం నిర్ధార‌ణ కిట్స్ తయారు చేయాల‌ని స‌ద‌రు సంస్థ‌కు బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది.  కేంద్ర ప్ర‌భుత్వం అప్ప‌గించిన ప‌నిని మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్ సంస్థ మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆరు వారాల రికార్డు సమయంలో COVID-19 కోసం మొదటి మేడ్ ఇన్ ఇండియా టెస్ట్ కిట్‌ను అభివృద్ధి చేసి సంచలనం సృష్టించింది. ఈ కిట్ ఇండియన్ ఎఫ్డిఎ / సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిస్కో) నుంచి వాణిజ్య ఆమోదం పొందిన మొదటి కిట్ గా నిలవ‌డం గ‌మ‌నార్హం. 

 

ఈ జాతీయ అత్యవసర సమయంలో రెగ్యులేటరీ బాడీస్ (సిడిస్కో / ఎఫ్‌డిఎ), ఐసిఎంఆర్, ఎన్‌ఐవి, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిరాక్) మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు, మరియు ఈ చర్యలు ప్రసంశనీయమని ఆయన కొనియాడారు. ఆర్‌టిపిసిఆర్ కిట్‌ల తయారీలో మైలాబ్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది. అందుకే కేంద్ర ప్ర‌భుత్వం అత్యంత విశ్వాసంతోనే ఆ సంస్థ‌కు ఈ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించిన‌ట్లుత స‌మాచారం. కిట్లు ప్ర‌స్తుతం అన్ని రాష్ట్రాల‌కు స‌రిపోను చేర్చే ప‌నిలో సంస్థ ప్ర‌తినిధులు ఉన్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లోని వివిధ ఆస్ప‌త్రుల్లో ఎక్క‌డిక‌క్క‌డ అనుమానిత వ్య‌క్తుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: