ప్రపంచ దేశాలన్నిటిని భయబ్రాంతులకు గురిచేస్తూ అందరిని గడగడలాడిస్తోంది కరోనా వైరస్. ప్రపంచదేశాల్లో భారతదేశం సహా చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కరోనా నియంత్రణకు ప్రపంచమంతా సామాజిక దూరం పాటిస్తున్నాయి. అందరూ ఇంటికే పరిమితమవుతున్నారు. అంతటా లాక్ డౌన్ విధించడంతో ఎవరూ బయట తిరిగే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే ఐసోలేషన్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ఐటీ కంపెనీ, ప్రభుత్వం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌తో బిజీగా ఉన్నారు. ఇంట్లోఉండి వర్క్ చేస్తునందున్న ఇంటర్నెట్ డేటా ఎక్కువ ఖర్చవుతోంది. దీని ఫలితంగా గతంలో వాడిన డేటా సరిపోవట్లేదు. అయితే మీకు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టైతే మీ వాట్సప్ వాడే డేటాను తగ్గించుకోవచ్చు.

 

అలాంటి అప్పుడే వాట్సప్‌ లో కొన్నిసెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే చాలు డేటా ఆదా అవుతోంది. ఆలా ఆదా చేయటం వలన డేటాను మీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. సరే మీకు వాట్సప్‌ సెట్టింగ్స్ లో ఎలా మార్చాలో తెలియదా.. అయితే ఇప్పుడు తెలుసుకోండి?

 

మీ వాట్సప్‌లో ఫస్ట్ ఆటో డౌన్‌లోడ్ సెట్టింగ్స్ మార్చండి. దింతో మనం క్లిక్ చేయకపోయినా మనకు వచ్చే ఫోటోస్, వీడియోస్, డౌన్ లోడ్ అవుతాయి. సరే మీ వాట్సప్‌ లో సెట్టింగ్స్ లో మొబైల్ డాటా మీద క్లిక్ చేయండి. ఆలా మీ ఫోన్ లో డేటా ఈ సెట్టింగ్స్ ను మార్చడం వలన కొంత వరకు డాటాను అదా చేసుకోవచ్చు. 

 

ఇంకా మీ వాట్సప్ కాల్స్‌ కు ఉపయోగించే డేటాను కూడా తగ్గించవచ్చును. అందుకోసం మీ వాట్సప్ సెట్టింగ్స్‌లో కాల్ సెట్టింగ్ ఓపెన్ చేసి లో డేటా పైన క్లిక్ చేయాలి. అందుకు మీ వాట్సప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి చాట్ సెక్షన్‌లో చాట్ బ్యాక్ అప్ పైన క్లిక్ చేసి ఆటో బ్యాకప్ ఆఫ్ చేయాలి. మీ ఫోన్ లో సెట్టింగ్స్ మార్చడం ద్వారా మీ వాట్సప్‌లో ఇంటర్నెట్ డేటా తాగించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: