ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ ఇస్తున్న వాటిలో రియల్‌మీ ఒకటి అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. నిన్నమొన్నటివరకూ పెద్దగా ఇమేజ్‌ లేని రియల్‌మీ బ్రాండ్‌ మొబైల్‌ ఫోన్లు అనాతికాలంలో భారీ క్రేజ్ సంపాధించుకున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీ రియల్‌మీ యూజ‌ర్ల‌కు ఆక‌ట్టుకోవ‌డంలో కొత్త పుంత‌లు తొక్కుతోంది. ఇదిలా ఉంటే.. రియ‌ల్‌మీ స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌కు క‌రోనా నేప‌థ్యంలో గుడ్ న్యూస్ తెలిపారు.

 

వారెంటీ పీరియడ్‌ను మే 31 వరకు పొడిగించింది. స్మార్ట్‌ఫోన్లతో పాటు అన్ని ప్రొడక్ట్స్‌కి ఇది వర్తిస్తుందని కంపెనీ తాజాగా ప్ర‌క‌టించింది. మ‌రియు ఇటీవల ప్రొడక్ట్స్ కొన్నవారికి కూడా రీప్లేస్‌మెంట్ పీరియడ్‌ను 30 రోజులు పొడిగించింది. ఉదాహ‌ర‌ణ చూస్తే.. రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర ప్రొడక్ట్ వారెంటీ మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 మధ్య అయిపోతుంది. ఇంతలో ఆ ప్రొడక్ట్‌కి ఏదైనా సమస్య వస్తే సర్వీస్ సెంటర్‌కు వెళ్లే అవకాశం లేదు. 

 

దీంతో వారెంటీ పీరియడ్‌లో ప్రొడక్ట్‌కి సమస్య వచ్చినా వారెంటీ కవర్ చేసుకునే అవకాశం లేదు. అయితే కస్టమర్లు ఈ ఇబ్బందులు పడకూడదని వారెంటీ పీరియడ్‌ను మే 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సో.. మీ రియల్‌మీ ప్రొడక్ట్ వారెంటీ ఎప్పటివరకు ఉందో చెక్ చేసుకోండి. అలాగే రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లతో పాటు వేరబుల్స్‌కి ఈ వారెంటీ వర్తిస్తుంది. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలను రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: