చైనాలోని వుహాన్‌లో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.  ఈ మహమ్మారి రోజురోజుకీ అధిక‌మ‌తున్న నేప‌థ్యంలో  ప్ర‌జలంతా ఇళ్ల‌లోకే ప‌రిమిత‌మ‌వుతున్నారు. దేశంలో లాక్‌డౌన్ విధించ‌డంతో సెల‌బ్రిటీలు సైతం సెల్ప్ కార్వంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. కేంద్రప్రభుత్వం కరోనా వైరస్ పై ప్రత్యేకమైన యాప్ ను రూపొందించింది. అదే కరోనా కవచ్ యాప్. ఈ యాప్‌ను కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు సంయుక్తంగా అభివృద్ధిచేశాయి. 

 

ఇది గంటకోసారి వినియోగదారుడి లొకేషన్‌ను ట్రాక్‌ చేస్తుంది. అతడి పరిసర ప్రాంతాల్లో కరోనా బాధితులు ఉంటే ఒక రంగును.. చుట్టుపక్క ప్రాంతాల్లో బాధితులు అస్సలు లేకుంటే మరో రంగును సూచించి అప్రమత్తం చేస్తుంటుంది. ప్రస్తుతానికి ఈ యాప్ ఆండ్రాయిడ్ కు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఈ యాప్ విజయవంతం అవ్వాలంటే దీనికి ప్రజల నుంచి కూడా ఎంతో సపోర్ట్ కావాలి. ప్రజలు ఇందులో అడిగిన వివరాలను సరిగ్గా అప్ డేట్ చేస్తేనే ఈ యాప్ సరిగ్గా పనిచేస్తుంది. ఇక దీన్ని ఎలా ఉప‌యోగించాలంటే..  కరోనా కవచ్ యాప్ ను ఓపెన్ చేయగానే ఈ యాప్ ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ రూపొందించినట్లు క‌నిపిస్తుంది.

 

ఆ తర్వాత కొన్ని పర్మిషన్లను అందించాలి. ఇప్పుడు మీ మొబైల్ నంబర్ ను అందించాక.. దానికి వచ్చిన ఓటీపీని కూడా ఎంటర్ చేయాలి. హోం పేజీలో మీకు ఎంతమంది ప్రజలకు కరోనా బారిన పడ్డారు, ఎంతమందికి నయం అయింది, ఎంతమంది మృతి చెందారు వంటి సమాచారం పొందొచ్చు. అలాగే అందులో ఉన్న మెనూకి వెళ్లి ఆ ప్రశ్నలకు క‌రెక్ట్‌ సమాధానం ఇస్తే.. మీ స్టేటస్ ఏంటి అని యాప్ తెలుపుతుంది. ఇక‌ అనంతరం ఇందులో ఉన్న కరోనా కవచ్ లోగోపై క్లిక్ చేయడం ద్వారా గంట సేపు మీ లొకేషన్ ను ఈ యాప్ ట్రాక్ చేస్తుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: