టెలికం రంగంలో చరిత్ర క్రియేట్ చేసిన రిలయన్స్ జియోకు ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక జియో ప్రారంభించిననాటి నుంచి అన్నీ సంచలనాలు, రికార్డులే.  వచ్చిన కొద్దికాలంలోనే ఫ్రీ ఆఫర్లతో ఊరించి.. అతి తక్కువ ధరకే డేటాను అందిస్తూ మొబైల్ యూజర్లను తనవైపుకు తిప్పుకుంది. అప్పటివరకూ టెలికం రంగంలో అగ్రస్థానంలో నిలిచిన ఇతర టెలికం ఆపరేటర్లు జియో దెబ్బకు దిగివచ్చాయి. అలాగే టెలికాం మార్కెట్ రంగాన్ని జియోకు ముందు జియోకు తరువాత అన్న చందంగా మార్చివేసిన ఈ దిగ్గజం యూజర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూపోతోంది.

 

ఇదిలా ఉంటే.. యూజ‌ర్ల‌కు జియో గుడ్ న్యూస్ అందించింది. సాధార‌ణంగా జియో రీఛార్జ్ చేయడానికి అనేక మార్గాలున్న సంగతి తెలిసిందే. అందులో జియో వెబ్‌సైట్‌, మైజియో యాప్‌తో పాటుపేటీఎం, గూగుల్ పే, అమెజాన్ పే లాంటి వ్యాలెట్స్ నుంచి కూడా రీఛార్జ్ చేయొచ్చు. అయితే ఇవేవీ అందుబాటులో లేకపోయినా.. మీ ద‌గ్గ‌ర ఏటీఎం కార్డు ఉంటే సులువుగా రీఛార్జ్ చేసుకోవ‌చ్చు. మీకు దగ్గర్లో ఉన్న ఏటీఎంకు వెళ్లి నిమిషాల్లో రీఛార్జ్ చేయొచ్చు. అది ఎలాగో చూసేయండి.

 

ముందుగా ఏటీఎంలో మీ డెబిట్ కార్డును ఇన్సర్ట్ చేయండి. అప్పుడు వ‌చ్చే మెనూలో రీఛార్జ్‌ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఏటీఎం పిన్ ఎంటర్ చేయండి. త‌ర్వాత మీరు ఎంత రీఛార్జ్ చేయాలనుకుంటారో అంత అమౌంట్ టైప్ చేయండి.
ఇప్పుడు స్టెప్‌లో కన్ఫామ్ చేయండి. దీంతో స్క్రీన్ పైన రీఛార్జ్ మెసేజ్ కనిపిస్తుంది. అప్పుడు మీ అకౌంట్‌లోంచి డబ్బులు డెబిట్ అవుతాయి. ఇక మీ మొబైల్ నెంబర్‌కు జియో నుంచి మెసేజ్ కూడా వ‌స్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: