ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రజలు లాక్ డౌన్ వల్ల మొబైల్ రీచార్జ్ చేసుకోవడంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ టెలికాం సంస్థ జియో వినియోగదారులకు శుభవార్త చెప్పింది. తమ కస్టమర్లకు 100 నిమిషాల టాక్ టైం తో పాటు 100 ఉచిత ఎస్ఎంఎస్ లను ఇవ్వనున్నట్లు జియో ప్రకటన చేసింది. 
 
ఏప్రిల్ 17 వరకు టాక్ టైం, ఎస్ఎంఎస్ లు ఉచితంగా ఇవ్వనున్నట్లు జియో పేర్కొంది. దేశంలో లాక్ డౌన్ నేపథ్యంలో చాలా చోట్ల మొబైల్ రీచార్జ్ చేసే దుకాణాలు మూతబడ్డాయి. ఆన్ లైన్ ద్వారా రీచార్జ్ చేసుకునే సదుపాయం ఉన్నప్పటికీ అందరికీ ఆన్ లైన్ ద్వారా రీచార్జ్ చేసుకోవడం సాధ్యం కాదు. అందువల్ల ట్రాయ్ టెలికాం సంస్థలను గడువు పెంచాలని కోరగా జియో ఈ నిర్ణయం తీసుకుంది. 
 
లాక్ డౌన్ పూర్తయ్యే వరకు తమ కస్టమర్లకు ఉచిత ఇన్ కమింగ్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్లు జియో పేర్కొంది. ట్రాయ్ సూచనల మేరకు ఏప్రిల్ 17 వరకు ఎయిర్ టెల్ కాలపరిమితిని పొడిగించిన విషయం తెలిసిందే. కాల పరిమితి పొడిగించడంతో పాటు 10 రూపాయల టాక్ టైంను కూడా ఎయిర్ టెల్ జత చేసింది. వొడాఫోన్ ఐడియా కూడా ఇదే ఆఫర్ ను ప్రకటించింది. కానీ ఆఫర్ అందరికీ కాకుండా కొంతమందికి మాత్రమే వర్తించేలా వొడాఫోన్ ఐడియా నిర్ణయం తీసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: