రియల్‌మీ.. ప్రస్తుతం చీపెస్ట్ సెల్ ఫోన్.. అతి తక్కువ ధరకే అతి ఎక్కువ ఫిచర్స్ తో అదిరిపోయే సెల్ ఫోన్స్ వస్తున్నాయి.. అలాంటి ఈ రియల్ మీ కూడా ఇప్పుడు ధరలు భారీగా పెంచేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మన భారత ప్రభుత్వం 2020 ఏప్రిల్ 1 నుంచి స్మార్ట్‌ఫోన్‌లపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచుతున్నట్టు ఇటీవలే నిర్ణయం తీసుకుంది. దీంతో రియల్ మీ తన స్మార్ట్ ఫోన్ల ధరలను భారీగా ప్రకటించేసింది. 

 

కరోనా వైరస్ కారణముగా స్మార్ట్ ఫోన్ పరిశ్రమలు బాగా ప్రభావితం చేశాయని.. విడి భాగాల ధరల పెరుగుదల, సరఫరా కొరతకు దారితీసిందని.. అలాగే రూపాయి విలువ కూడా పడుతూ లేస్తూ స్మార్ట్ ఫోన్ తయారీకి అయ్యే ఖర్చును కూడా ప్రభావితం చేస్తుంది అని అందువల్ల చాలా స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు 2019, 2020లలో వాటి ధరలను పెంచాయి అని.. కానీ 2018 నుండి కూడా రియల్ మీ స్మార్ట్ ఫోన్ ధరను పెంచలేదు అని ప్రకటించింది. 

 

కాగా రియల్ మీ ధరలు ఇలా పెరిగాయి.. రియల్ మీ 6 స్మార్ట్ ఫోన్ ధర లాంచ్ అయినా సమయంలో రూ.12,999గా ఉండగా ఇప్పుడు రూ.13,999గా నిర్ణయించారు.. రియల్ మీ 6 ప్రో ధర కూడా రూ.16,999గా ఉండగా ఇప్పుడు రూ.17,999 అయ్యింది. రియల్ మీ 5ఐ స్మార్ట్ ఫోన్ ధర లాంచ్ కూడా రూ.8,999గా ఉండగా, ఇప్పుడు రూ.9,999గా ఉంది. ఇక రియల్ మీ ఎక్స్2 ధర రూ.16,999గా ఉండగా, ఇప్పుడు రూ.17,999కు చేరింది. ఇలా తన రియల్ మీ ఫోన్లు అన్నిటి ధరలు కూడా పెంచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: