ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ కార‌ణంగా కేంద్రం లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న‌ పదానికి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ప్రపంచమంతా కరోనా కల్లోలం సృష్టిస్తుండటంతో చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హెమ్ ఇచ్చేసాయి. ఇంటి దగ్గర నుంచి పనిచేసే వారిని ఎయిర్ టెల్ లక్ష్యంగా చేసుకుంది. అందుకే వారి కోసం ప్రత్యేకంగా 15 జీబీ, 35 జీబీ డేటా యాడ్-ఆన్ ప్యాకేజ్ ని లాంచ్ చేసింది.

 

అందులో మొదటి ప్యాక్ ధర రూ.100గా ఉంది. దీని ద్వారా 15 జీబీ డేటా లభిస్తుంది. దీంతో పాటు ఎయిర్ టెల్ రూ.200 డేటా యాడ్ ఆన్ ప్యాక్ కూడా అందిస్తుంది. ఈ ప్యాక్ ద్వారా 35 జీబీ డేటా లభిస్తుంది. ఎయిర్ టెల్ ఈ ప్యాక్ లను జనవరిలోనే లాంచ్ చేసింది. అయినప్పటికీ ఇప్పటికీ వీటిని వర్క్ ఫ్రం హోం ప్యాక్ లుగా ప్రమోట్ చేస్తుంది. ఇక మొబైల్ డేటా వాడుతూ ఇంటి వద్ద నుంచి పనిచేసే వారికి ఈ డేటా ప్యాక్ లు ఎంతో చ‌క్క‌గా యూజ్ అవుతాయి. 

 

అలాగే ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ లో మేనేజ్ సర్వీసెస్ లో ఈ డేటా ప్యాక్ లను యాక్టివేట్ చేసుకోవచ్చు. కాగా, ఇప్ప‌టికే రిలయన్స్ జియో 'వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాక్' ను ప్రారంభించింది. దీని ప్రకారం వినియోగదారులు రోజుకు 2 జీబీ డేటా వినియోగించుకోవచ్చు. కాలపరిమితి 51 రోజులు. ధరను రూ.251గా నిర్ణయించింది. 2జీబీ డేటా పరిమితి ముగిసిన తర్వాత 64 కేబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ను పొందొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: