క‌రోనా వేర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌పంచ‌దేశాల‌ను ప్ర‌స్తుతం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. క‌రోనా దెబ్బ‌కు ప్ర‌జ‌లు అబ్బా అంటున్నారు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ అతి త‌క్కువ స‌మ‌యంలోనే దేశ‌దేశాలు వ్యాప్తి చెందండంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో క‌రోనాపై ఉన్న‌వి.. లేనివి చెప్పి మ‌రింత భ‌య‌పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల‌కు ఏది న‌మ్మాలో.. ఏది న‌మ్మ‌కూడ‌దో.. తెలియ‌క పిచ్చెక్కిస్తున్నారు.

 

దీన్ని అరికట్టి ప్రజలకు శాస్త్రీయమైన సమాచారం అందించడానికి దేశంలోని ప్రముఖ శాస్త్ర విజ్ఞాన సంస్థలు నడుం బిగించారు. ఇందులో భాగంగా భారతీయ సైంటిస్టులే ఓ వెబ్‌సైట్ ప్రారంభించారు. అదే కొవిడ్ జ్ఞాన్ (https://covid-gyan.in/). ఈ వెబ్‌సైట్‌లో కరోనా వైరస్‌‌పై శాస్త్రీయమైన, నమ్మదగిన, కచ్చితమైన సమాచారం లభిస్తుంది. బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌, టాటా మెమోరియల్‌ సెంటర్‌ సంయుక్తంగా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించాయి. 

 

ప్రజల్లో అపోహలను పారద్రోలాలనే ఉద్దేశంతో అనేక మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు దీన్ని నిర్వహిస్తుండటం విశేషం. ఇక ఈ వెబ్‌సైట్‌లో మీకు కరోనా వైరస్‌, కొవిడ్‌లకు సంబంధించిన పూర్తి శాస్త్రీయ సమాచారం లభిస్తుంది. ఫొటోలు, డేటా, వీడియోలూ ఉంటాయి. ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా ఈజీగా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. అంతేకాదు... కరోనా వైరస్‌కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా ఉన్న వెబ్‌సైట్ల సమాచారం కూడా ఇచ్చారు. అలాగే తెలుగు, కన్నడ, తమిళం, మళయాళంతోపాటు మొత్తం 12 భారతీయ భాషల్లో సమాచారం ఈ వెబ్‌సైట్‌లో లభిస్తుంది. కాబ‌ట్టి ఈ వెబ్‌సైట్‌ను ఫాలో అవుతూ.. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వ‌దంతుల‌కు చెక్ పెట్టండి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: