వాట్సాప్‌.. నేటి త‌రానికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు వినియోగించే వారు ఖ‌చ్చితంగా వాట్సాప్‌ను యూజ్ చేస్తున్నారు. ఈ ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ రాకతో సోషల్ నెట్ వర్కింగ్ మరింత వేగాన్ని పుంజుకుంది. రోజు వారీ అవసరాలకు, ఆఫీస్ ల్లో కమ్యూనికేషన్ కోసం ఇలా వివిధ రకాలుగా కోట్లాది మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వాట్సాప్ వినియోగం విపరీతంగా విస్తరిస్తోంది. ఇక వాట్సాప్ సైతం త‌మ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకొస్తూ ఆకర్షిస్తోంది. తాజాగా కూడా వాట్సాప్ అదే చేసింది. 

 

ప్ర‌స్తుతం తీసుకొచ్చిన ఫీచ‌ర్ ద్వారా గ్రూపుల్లో వీడియో కాల్స్ చేసుకోవ‌డం మ‌రింత సులువుగా మారుతుంది. సాధార‌ణంగా  గ్రూపుల్లో వీడియో కాల్స్ చేయ‌డానికి ముందుగా గ్రూప్ చాట్ లో కుడివైపు పైభాగంలో ఉన్న వీడియో కాల్ ఐకాన్ ను క్లిక్ చేశాక ఏయే గ్రూప్ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడాలనుకుంటున్నారో ఎంచుకోవాలి. అయితే ఇప్పుడు ఆ బటన్ పై నేరుగా క్లిక్ చేయగానే నేరుగా వీడియో కాల్ స్టాట్ అవుతుంది. కానీ, ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.. ఈ వన్ స్టెప్ ప్రాసెస్ కేవలం నలుగురు లేదా అంతకంటే తక్కువమంది ఉన్న గ్రూపుల్లోనే యూజ్ అవుతుంది.

 

ఈ మేర‌కు నలుగురు కంటే తక్కువమంది ఉన్న గ్రూపుల్లో వీడియోకాల్స్ ను మరింత సులభం చేయాలనే ఉద్ధేశంతోనే ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వాట్సాప్ వెల్ల‌డించింది. కాగా, వివిధ దేశాల్లో ఉన్న లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్సింగ్ కష్టం అవుతుంది. దీంతో చాలా మంది జూమ్ వంటి యాప్స్ పై ఆధారపడటం స్టాట్ చేశారు. దీన్ని సులభతరం చేయడం ద్వారా వాట్సాప్ కూడా ఇందులో అడుగుపెట్టాలని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: