ప్రపంచంలో ప్రస్తుతం చాలా దేశాలు లాక్ డౌన్ ని పాటిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి నుండి బయటికి రావడానికి వీలు ఉండదు. కాబట్టి అందరూ వారి వారి ఇళ్లలోనే ఉండాల్సి ఉంటుంది. అయితే ఇంట్లో ఉండడం వల్ల ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. అయితే ఈ లాక్ డౌన్ పరిస్థితి ఇంకొన్ని రోజులు పెంచడం ఖాయమని ఉద్దేశంతో ఇప్పుడు అందరూ ఆన్లైన్లో సందడి చేస్తున్నారు. దీని కోసం కొంత మంది యాప్ లను వాడటం ఎక్కువయింది. 

 


ఇక అసలు విషయానికి వస్తే... ఈ సమయంలో డేటింగ్ యాప్ క్వాక్ క్వాక్.. నీ ఉపయోగించే వారి సంఖ్య చాలా ఎక్కువ అయింది. ముఖ్యంగా లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ఈ యాప్ లో ప్రతి రోజూ 18 వేల మందికి పైగా కొత్త వినియోగదారులు చేరుతున్నారని తెలుస్తోంది. అంతేకాక ఇందులో రోజుకు 80 లక్షలకు పైగా యాక్టివ్ యూజర్లు ఈ యాప్ లో ఉన్నారని తెలుస్తోంది. ఈ వివరాలకు నిన్న అనగా శుక్రవారం నాడు కంపెనీ వారి లెక్కలను విడుదల చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో చాట్ మెసేజ్ లు కూడా రోజుకి మూడున్నర లక్షల నుంచి 5 లక్షల వరకు చేరాయని సంస్థ తెలిపింది. అయితే ఈ సంస్థ ఈ యాప్ ని ఎవరు ఎక్కువగా వాడుతున్నారు అనేదాన్ని విషయం కూడా తన లెక్కల్లో తెలిపింది.

 


ఇక వారి విషయానికి వస్తే అందులో 50శాతం పైగా మార్కెటింగ్ వ్యక్తులు, 25 శాతం పైగా వ్యాపారులు, 25 శాతం విద్యార్థులు ఎక్కువగా ఇందులో చేరుతున్నారని వివరించింది. అంతేకాక రోజుకి 80 శాతం మంది కొత్త యూజర్స్ చేరుతున్నారని ఆ యాప్ చెప్పుకొచ్చింది. దీనితో వారి కంపెనీ ఆదాయం 20 శాతం మేర పెరిగిందని సంస్థ యజమాని రవి మిట్టల్ తెలిపారు. ఇక్కడ ఇంకో విశేషమేమిటంటే యువతతో పాటు పెళ్లైన వాళ్ళు ఎక్కువగా ఉండటం ఆలోచించే విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: