నోకియా.. ఈ కంపెనీ పేరు వినగానే ఈ ఫోన్లు చాలా స్ట్రాంగ్ గురు అని అనేస్తాం. ఎందుకంటే అసలు ఫోన్లే లేని కాలంలో ఈ ఫోన్లు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఆ ఫోన్ కింద పడిన.. నీళ్ళలోకి పడిన పెద్ద తేడా ఉండేది కాదు.. మళ్లీ యధావిధిగా ఈ ఫోన్ పని చేసేది. అందుకే ఈ కంపెనీ అంటే అందరికి అంత ఇష్టం. 

 

ఇకపోతే.. అప్పట్లో ఈ ఫోన్ స్ట్రాంగ్ అయినప్పటికీ.. ఇప్పుడు దీనికి మించిన క్వాలిటీ తో ఎన్నో కంపెనీలు మన ముందుకు వచ్చాయి. అందుకే నోకియా కాస్త వెనుకపడింది.. అయితే ఇప్పుడు నోకియా మార్కెట్ మళ్లీ పుంజుకుంది.. అందుకే త్వరలోనే నోకియా నుండి మరో రెండు సూపర్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. 

 

అవి ఏంటి అంటే? నోకియా 9.3 ప్యూర్ వ్యూ, నోకియా 7.3 స్మార్ట్ ఫోన్లు. ఈ సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ లో ఈ ఫోన్లు లాంచ్ కానున్నట్టు సమాచారం. అయితే ఈ స్మార్ట్ ఫోన్లకు సంబంధించి ఎటువంటి లీకులు బయటకు రాలేదు.. కాగా ఈ స్మార్ట్ ఫోన్ల ధర రూ.49,999పైగా ఉండే అవకాశాలు ఉన్నాయి.. మరి ఈ స్మార్ట్ ఫోన్లకు సంబంధించి ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలియాలి అంటే కాస్త సమయం పడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: