నేటి కాలంలో అంతా స్మార్ట్‌ఫోన్ మ‌యం అయిపోయింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఫోను లేకుండా రోజు గడవడం కష్టంగా మారింది. ఇక కాలాగుణంగా మారిన మార్పులతోపాటు, అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ పుణ్యమా అని స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి రావ‌డంతో.. అంద‌రూ వీటినే యూజ్ చేస్తున్నారు. అయితే స్మార్ట్‌ఫోన్ వినియోగం ఎంత పెరిగిందో వాట్సాప్ వినియోగం కూడా అంతే స్థాయిలో పెరిగింది. మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్ ను విపరీతంగా వాడుతున్నారు.

 

దీంతో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఫోన్ లోను ఈ యాప్ తప్పనిసరిగా ఉంటోంది. వాట్సాప్ సైతం త‌న యూజ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తెస్తుంది. అయితే వాట్సాప్‌లో మన‌కు తెలియ‌ని ట్రిక్స్ ఎన్నో ఉంటాయి. ఇందులో భాగంగా ఓ అద్భుత‌మైన ట్రిక్ గురించి తెలుసుకుందాం. గూగుల్ అసిస్టెంట్ ద్వారా మీరు వాట్సాప్ లో ఇన్ స్టంట్ టెక్స్ట్ లేదా వాయిస్ మెసేజ్ లను పంపవచ్చు. 

 

ఓకే గూగుల్ లేదా హే గూగుల్ అనడం ద్వారా మీరు మీ వాయిస్ అసిస్టెంట్ కు లేదా గూగుల్ అప్లికేషన్ ఉపయోగించైనా, ఈ వాయిస్ అసిస్టెంట్ యాక్సెస్ చేయవచ్చు. ఆ తర్వాత, మీరు మెసేజ్ ఎవరికి పంపాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్ పేరు ను చెప్పడం ద్వారా ఈ మెసేజ్ ను వారికి పంపవచ్చు. అంతేకాదండోయ్‌.. ఆ మెసేజ్‌ను మీరు చదవడానికి ఆ యాప్ ను ఓపెన్ చేయమని కూడా అడగవచ్చు. కాబ‌ట్టి.. ఇక నుంచి ఇలా కూడా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: