ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాలు చుట్టు ముట్టింది. ఈ క్ర‌మంలోనే అటు ప్ర‌జ‌లు, ఇటు ప్ర‌భుత్వాల క‌రోనాతో తీవ్రంగా పోరాడుతున్నారు. అయిన‌ప్ప‌టికీ ఈ మ‌హ‌మ్మారి జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికే క‌రోనా పాజిటివ్ కేసులు 20 ల‌క్ష‌లు చేరువ అవుతుంది. ఇక మ‌ర‌ణాలు సంఖ్య 1.20పైగా చేరుకుంది. ఎన్న‌డూలేని ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు ప్ర‌జ‌ల‌ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ప్ర‌స్తుతం క‌రోనాను మ‌ట్టుపెట్టేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ప్ర‌జ‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డే లాక్ అయ్యారు.

 

ఇక ఈ లాక్‌డౌన్ దెబ్బ‌కు ఆర్థిక వ్య‌వ‌స్థ కూడా కుప్ప‌కూలింది. మ‌రోవైపు ఎన్నో కంపెనీలు మూత‌ప‌డి.. ఉద్యోగులు కాస్త నిరుద్యోగులుగా మారారు. అయితే ఈ క‌రోనా లాక్‌డౌన్ స్మార్ట్‌ఫోన్ల‌పై కూడా ప‌డిన‌ట్టు తెలుస్తోంది. పూర్తివివ‌రాల్లోకి వెళ్తే లాక్‌డౌన్ త‌ర్వాత కొత్త స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేయాల‌నుకునేవారికి దిమ్మ‌తిరిగేలా క‌నిపిస్తుంది. ఎందుకంటే..  ఏప్రిల్ 1 నుంచి కొత్త జీఎస్‌టీ అమలులోకి వచ్చింది. కానీ,  లాక్‌డౌన్ దెబ్బ‌కు మొబైల్ షాప్స్ మూత‌ప‌డ్డాయి. ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్ సేల్ కూడా లేదు. 

 

దీంతో ఇప్ప‌టికే మొబైల్ కంపెనీలు ధరల్ని పెంచేశాయి. షావోమీ, రియల్‌మీ లాంటి కంపెనీలు కొత్త ధరల్ని ప్రకటించాయి కూడా. స్మార్ట్‌ఫోన్ ధరను బట్టి రూ.500 నుంచి రూ.1000 మధ్య ధర పెరిగింది. వాస్త‌వానికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్లపై జీఎస్‌టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచడంతో కంపెనీలు ఈ ధర పెంచక తప్పలేదు. జీఎస్‌టీ భారం పెరగడంతో కంపెనీలు ఇప్పుడు ధరలు పెంచక తప్పలేదు. లాభాల వాటాను తగ్గించుకునే పరిస్థితి లేకపోవడంతో కంపెనీలు ధరల్ని పెంచడం వైపే మొగ్గుచూపాయి. దీనిని బ‌ట్టీ లాక్‌డౌన్ త‌ర్వాత కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలంటే అధిక ధ‌ర‌లు చ‌ల్లించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: