కరోనా మహమ్మారి ప్రపంచంలో వేగంగా విస్తరిస్తోంది. సైంటిస్ట్ లు కరోనా ను కనుగొనే మార్గాలు ఎన్నో విధాలుగా కనిపెడుతూనే ఉన్నారు. అయినప్పటికీ కొన్ని విధానాలు సఫలమైనప్పటికీ కొన్ని విధానాలు విఫలం అవుతున్నాయి . ఐఐటీ రూర్కీతో కలిసి జపాన్‌లోని క్యోటోలో ఉన్న భారతీయ శాస్త్రవేత్తలు ఈ మేరకు ముమ్మరంగా ప్రయోగాలు చేస్తున్నారు. వీరు కనిపెట్టిన విధానం ద్వారా కరోనాను చాల సులభంగా కనిపెట్టవచ్చని వారు చెబుతున్నారు. ఇప్పటివరకు ఉన్న విధానాలద్వారా కరోనా ను టెస్ట్ చేయాలంటే వ్యాధి సోకిన వ్యక్తి ముక్కునుండి మరియు నోటినుండి నమూనాలను సేకరించ వలసి ఉంటుంది అయితే ఈ సమయంలో పరీక్షించే  వ్యక్తి కి ప్రమాదం లేకపోలేదు.

 

 

వారికీ కూడా ఆ వ్యాధి సోకె అవకాశం వుంది. కొత్తగా ఐఐటీ రూర్కీ చెబుతున్న విషయం ఏమిటంటే వ్యాధి లక్షణాలున్న వ్యక్తిని నేరుగా కాంటాక్ట్ అవ్వకుండా  ఎక్స్‌రే కిరణాల ద్వారా వైరస్ ను గుర్తించే విధంగా సాఫ్ట్వేర్ ను పొందు పరచినట్లు తద్వారా కరోనా  జాడ గుర్తించే వెసులుబాటు ఉందని తెలియజేశారు. ఈ తరహాలోనే మరిన్ని ఇతర సూక్ష్మ జీవులను కూడా గుర్తించే విధంగా అప్లికేషన్ లను పొందుపరచామని తెలియజేశారు. ఏదేమైనప్పటికీ మనిషి ఆశాజీవి .ఎదురు చూడడమే మనపని ....

మరింత సమాచారం తెలుసుకోండి: