ప్రపంచం మొత్తం కరోనా కి కేరాఫ్ అడ్రస్ అయ్యిపోయింది. ఒక్క రోజులేనే వేలాది మంది మృతి చెందట..లక్షల సంఖ్యలో  ప్రజలు కరోన బారిన పడటం మనం చూస్తూనే ఉన్నాము. అయితే కరోనా మనకి సోకకుండా ఉండాలంటే అందుకు సోషల్ డిస్టెన్స్ తప్పని సరి అలాగే చేతులని శుభ్రం చేసుకోవడం కూడా ఎంతో ముఖ్యమైన విషయం ఇలా చేయడం వలన కరోనా మనకి సోకదు..ఇక్కడ వరకూ బాగానే ఉంది...మరి

IHG

రెగ్యులర్ గా డబ్బులతో జరుపుతున్న లావాదేవీలు..రోజు నిమిషానికి ఒక సారి ముట్టుకునే సెల్ ఫోన్ లు, ల్యాప్ టాప్ లు, పెన్నులు పుస్తకాలు..అబ్బో ఒకటేమిటి తడప కూడనివి ఎన్నో ఉన్నాయి. మరి వాటి మాటేమిటి వాటికి పట్టే క్రిములు, వైరస్ లని ఎలా వదిలించుకోవాలి. ఇలాంటి సందేహాలు అందరికి ప్రస్తుత పరిస్థితులలో కలుగుతున్నాయి. ఇలాంటి వస్తువులని రాయనాలతో కూడిన శానిటైజర్స్ తో శుద్ది చేయడం సాధ్యం కాదు...అలాంటి వాటిని క్రిములు లేకుండా శుభ్రం చేయడానికి డీఆర్డీవో ల్యాబ్ , రీసెర్చ్ సెంటర్ ఇమారత్ కలిసి సరికొత్తగా శానిటైజర్ క్యాబినెట్ ని ఆవిష్కరించాయి..

IHG

అరలు అరలుగా ఉండే ఈ పెట్టెలో మనకి సంభందించిన సెల్ ఫోన్ నోట్ల కట్టలు , ల్యాప్ టాప్ లని ఉంచితే అతినీల లోహిత కిరణాల ద్వారా అందులో ఉంచిన వస్తువులు శానిటైజ్ అవుతాయి. ఇందులో వేగంగా ప్రసరించే యూవీ కిరణాలు కరోనా వైరస్ లోని జన్యు పదార్ధాన్ని మరే ఇతర సూక్ష్మ జీవులు ఉన్నా నాశనం చేస్తాయి. ఎన్-95 మాస్కులని శుభ్రపరిచి మళ్ళీ వాడుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగ పడుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాంకర్స్ ఇబ్బంది లేకుండా కరెన్సీ నోట్లు, పాస్ బుక్స్ ఇలా ముఖ్యమైన ఫైల్స్ ని కూడా శానిటైజ్ చేసుకోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: