ఫోన్.. ఒకప్పుడు అటు నుండి ఇటు సమాచారం కోసం ఉపయోగించేది.. ఇప్పుడు జీవితాన్ని అంత ఫోన్ లోనే పెట్టేస్తాం.. అదే స్మార్ట్ ఫోన్. ఇంకా అలాంటి స్మార్ట్ ఫోన్స్ లో ఇప్పుడు తోపు స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ ఏంటి అంటే? యాపిల్, ఐఫోన్.. ఇంకా ఈ రెండు టాప్ బ్రాండ్స్ నుండి రెండు టాప్ ఫోన్లు తెర మీదకు వచ్చాయి. 

 

ఏవ్ ఐఫోన్ ఎస్ఈ, వన్ ప్లస్ 8 సిరీస్. ఇంకా రెండు స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి.. అందులో ఏ స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఏంటి ? దానిలో స్పెసిఫికేషన్లు ఏంటి? ధర ఏంటి? అసలు ప్రత్యేకతలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. కోనేసేయండి..

 

ధరలో ఏది బెస్ట్.. 

 

ఐఫోన్ ఎస్ఈ 64 జీబీ ఏకంగా రూ.42,500.. వన్ ప్లస్ 128 జీబీ రూ.41,999.. అంటే దీన్ని బట్టి చూస్తే.. ఐఫోన్ 64 జిబీకే 42 వేలు.. కానీ వన్ ప్లస్ అలా కాదు.. ఏకంగా 128 జిబీ నే 41,999. అంటే ధరలో వన్ ప్లస్ ఏ బెస్ట్. ఐఫోన్ ఎస్ఈ 256 జీబీ రూ.58,300. ఇంకా వన్ ప్లస్ 8.. 256 జీబీ స్టోరేజ్ ధర రూ.49,999. అంటే దీన్ని బట్టి చూస్తే వన్ ప్లస్ ఏ ధరలో బెస్ట్. 

 

 ప్రాసెసర్ లో ఏ ఫోన్ బెస్ట్.. 

 

ఐఫోన్ ఎస్ఈ మూడో తరం న్యూరల్ ఇంజిన్ ను కలిగిన ఏ13 బయోనిక్ చిప్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇంకా వన్ ప్లస్ 8 కాల్వ్ కామ్ స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ పై వన్ ప్లస్ 8 పని చేయనుంది. అయితే ఇందులో ఈ రెండు స్మార్ట్ ఫోన్లు బెస్ట్ ఏ.. 

 

డిస్ ప్లే ఏ ఫోన్ పెద్దది అంటే.. 

 

ఐఫోన్ ఎస్ఈ.. 4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే.. కానీ వన్ ప్లస్ 8: 6.55 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. డిస్ ప్లే లో వన్ ప్లస్ 8 స్మార్ట్ ఫోన్ ఏ బెస్ట్. 

 

ఆపరేటింగ్ సిస్టంలో ఏ స్మార్ట్ ఫోన్ బెస్ట్.. 

 

ఐఫోన్ ఎస్ఈ, వన్ ప్లస్ 8 రెండు కూడా ఒకటే.. రెండు లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. 

 

​ కెమెరా ఏ ఫోన్ లో బాగుంది.. 

 

ఇంకా ఇందులో కూడా ఇంచు మించు రెండు ఫోన్లు ఒకటే.. రెండు ఫోన్లు దాదాపు ఒకటేలా ఉన్నాయి. 

 

సెల్ఫీ కెమెరాలలో ఏది బెస్ట్ అంటే.. 

 

వన్ ప్లస్ 8 ఏ ఐఫోన్ కంటే కూడా బెస్ట్.. ఇందులో ఏలాంటి సందేహం లేదు. 

 

ఇంకా బ్యాటరీ విషయంలో కూడా నిసందేహంగా చెప్పేయచ్చు.. వన్ ప్లస్ 8యే సూపర్ ఫోన్ అని.. ఇందులో ఏలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికి వరుకు విడుదలైన అన్ని ఐఫోన్ సిరీస్ లోను బ్యాటరీ వేస్ట్ అని తేలిపోయింది.. ఈ స్మార్ట్ ఫోన్ లో కెమెరా బెస్ట్ అనుకునే వాళ్ళం.. కానీ ఇప్పుడు అంత లేదు అని తేలిపోయింది. 

 

ఇంకా దీనిబట్టి చూస్తే.. అన్ని విధాలుగా వన్ ప్లస్ 8 స్మార్ట్ ఫోన్ ఏ బెస్ట్.  

మరింత సమాచారం తెలుసుకోండి: