వాట్సాప్‌.. ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. నేటి త‌రంలో స్మార్ట్‌ఫోన్ యూజ్ చేస్తున్న వారంద‌రూ వాట్సాప్‌ను యూజ్ చేస్తున్నారు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు చెందిన ఈ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. వాడేవారు కోట్ల‌లో ఉన్నారు అంటే అతిశ‌యోక్తి కాదు. మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్ ను విపరీతంగా వాడుతున్నారు. ముఖ్యంగా వాట్సాప్ వాడ‌టానికి సుల‌భంగా ఉండ‌టంతో దీనిపై మ‌రింత క్రేజ్ పెరిగింది. మ‌రియు ఉచితంగానే సర్వీసులోను వినియోగించుకునే అవకాశం ఉండటం, ఎలాంటి యాడ్స్‌ లేకపోవడం వల్ల దీని వాడకందారులు పెరుగుతున్నారు. 

 

ఇక వాట్సాప్ సైతం ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకువ‌స్తూ.. యూజ‌ర్ల‌ను భారీ స్థాయిలో ఆక‌ట్టుకుంటుంది. అయితే వాట్సాప్ వాడుతున్న‌వారికి ఇక‌పై తిప్ప‌లు త‌ప్పేలా లేవు. విష‌యం ఏంటంటే.. ఇకపై వాట్సప్‌లో కూడా యాడ్స్ రాబోతున్నాయి. వాట్సప్ మాతృ సంస్థ అయిన ఫేస్‌బుక్ చాలాకాలంగా ఈ ప్రయత్నాలు కొన‌సాగిస్తోంది. ఈ క్ర‌మంలోనే త్వరలో వాట్సప్‌లో యాడ్స్ తీసుకొచ్చేందుకు ఫేస్‌బుక్ చూస్తోంది. అయితే వాట్సప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సెక్యూరిటీ ఫీచర్ ఉంది. అంటే మెసేజ్ పంపినవాళ్లు, స్వీకరించినవాళ్లు మాత్రమే ఆ మెసేజ్ చదవగలరు. 

 

థర్డ్ పార్టీ యాప్స్ ఆ మెసేజెస్‌ని చదివే అవకాశం లేదు. అలాంటప్పుడు వాట్సప్ యూజర్లకు టార్గెటెడ్ యాడ్స్‌ని డిస్‌ప్లే చేయడంలో ఫేస్‌బుక్‌కు సమస్యలు రావొచ్చు అని అంటున్నారు. ఇక ఫేస్‌బుక్ అకౌంట్స్‌లోని వాట్సప్ నెంబర్లను గుర్తించి టార్గెటెడ్ యాడ్స్‌ని డిస్‌ప్లే చేయాలన్న ఆలోచన కూడా ఉంది. కాగా, ఫేస్‌బుక్ డేటాతో వాట్సప్‌లో యాడ్స్ డిస్‌ప్లే చేయాలన్న ప్రతిపాదన గతంలో వివాదాలకు కారణమైంది. వాట్సప్ స్టేటస్‌లో యాడ్స్ ప్లే చేయాలని 2018 లోనే అనుకుంది ఫేస్‌బుక్. ఇప్పుడు ఆ ప్రణాళికల్ని ముమ్మ‌రం చేస్తుందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే వాస్త‌వానికి యాడ్స్ లేక‌పోవ‌డం వ‌ల్లే వాట్సాప్ క్రేజ్ పెరిగింద‌ని చెప్పుకోవ‌చ్చు. అలాంటివి ఇప్పుడు ఫేస్‌బుక్‌.. ఇందులో యాడ్స్ తీసుకొస్తే యూజ‌ర్లు ఖ‌చ్చితంగా అస‌హ‌నం వ్య‌క్తం చేస్తారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: