ఇటీవల కాలంలో వాట్సాప్ సరికొత్త అప్డేట్లను తమ వినియోగదారుల కోసం విడుదల చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన రోజు నుండి ఇప్పటికే దాదాపు మూడు పైగా విలువైన అప్డేట్లను విడుదల చేసింది. ఎనిమిది మంది ఒకేసారి మాట్లాడుకునే వెసులుబాటు కల్పించి అందరి ప్రశంసలు అందుకున్న వాట్సాప్ తాజాగా ఒక్క అకౌంట్ ని అనేక డివైసెస్ లలో( ఫోన్లు, ఐ పాడ్) ఉపయోగించుకునెలా మరొక అప్ డేట్ ని రిలీజ్ చేయబోతోంది.


2.20.143 ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్ పై వర్క్ చేస్తున్న ఆ సంస్థ... మల్టీ డివైస్(multi-device) అనే ఫ్యూచర్ ని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. వాస్తవానికి మల్టీ డివైస్ ఫీచర్ ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు గత సంవత్సరం నుండే వాట్సాప్ సంస్థ ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఈ విషయంపై గతంలో ఎన్నడూ క్లారిటీ ఇవ్వలేదు. ఐతే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం... మల్టీ డివైస్ ఫీచర్ నెక్స్ట్ అప్డేట్ ఐన 2.20.143 ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్ లో ఇవ్వబడుతుందని తెలుస్తుంది.


వాట్సాప్ బీటా వెర్షన్ సంస్థ నుండి రెండు సరికొత్త ఫోటోలు విడుదల కాబడ్డాయి. ఆ ఫోటోలను పరిశీలిస్తే... వైఫై కి కనెక్ట్ అయితేనే కొత్త డివైస్ లో లాగిన్ అవ్వొచ్చు అని... లేకపోతే లాగిన్ అయ్యేందుకు కాస్త టైమ్ పడుతుందని రాసి ఉంది. మరొక ఫోటో ని పరిశీలిస్తే మొబైల్ డేటా వాడటం వలన లాగిన్ ప్రొసీజర్ ఆలస్యం అవుతుందని, అలాగే డేట్ ప్లాన్ మొత్తం అయిపోతుంది రాసి ఉంది. అయితే ఒక అకౌంటు మరొక కొత్త డివైస్ లో లాగిన్ అవుతే... కంపల్సరిగా ఆ అకౌంట్ కి సంబంధించిన మెసేజ్లు మొత్తం కొత్త డివైస్ లో చూపించాలి. అలా చూపించాలంటే చాలా మెసేజ్ లో ట్రాన్స్ఫర్ కావాలి కాబట్టి వై-ఫై కనెక్షన్ అయితే స్పీడ్ గా ఉంటుందని ఈ ఫోటోలో తెలుపుతున్నట్టు అర్థమవుతుంది. ఒక సారి లాగిన్ అయిన అనంతరం వాట్సాప్ ఫోన్ కాల్, వీడియో కాల్ మెసేజ్లు నోటిఫికేషన్లు అన్ని కూడా లాగిన్ అయిన ప్రతి ఒక్క డివైస్ కి వస్తాయని నివేదిక తెలిపింది. రెండు మూడు ఫోన్లు యూస్ చేసే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: