క‌రోనా వైర‌స్.. ప్ర‌పంచ‌దేశాల్లోనూ ఈ మ‌హ‌మ్మారి రోజురోజుకు విశ్వ‌రూపాన్ని చూపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంవ్యాప్తంగా ముప్పై ల‌క్ష‌ల‌కుపైగా క‌రోనా పాజిటివ్‌గా తేలారు. మరోవైపు రెండు ల‌క్ష‌ల‌కుపైగా క‌రోనా సోకి మ‌ర‌ణించారు. దీని కట్టడికి వ్యాక్సిన్ కూడా లేకపోవడంతో.. అదుపు చేయడం కష్టతరంగా మారింది. ఈ క్ర‌మంలోనే క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఇక ఈ లాక్‌డౌన్ సమయంలో తమ బంధువులతో, స్నేహితులతో అన్ని విషయాలు పంచుకోవడానికి చాలా మంది ఫేస్‌బుక్‌నే వేదికగా చేసుకుంటున్నారు. తమ భావాలు పంచుకోవడానికి ఎమోజీలను ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు.

IHG

భావోద్వేగాలను ఒక్క ముక్కలో వ్యక్తం చేయడానికే ఎమోజీ ఫీచర్ వచ్చింది. ఈ ఎమోజీలను చాటింగ్ ప్రియులు ఎంత ఆదరించారంటే చాటింగ్‌ అంటేనే  పదాలు తక్కువ ఎమోజీలు ఎక్కువ అనే ట్రెండ్ నడుస్తోంది.  సందర్భం ఏదైనా, ఆనందం, కోపం, బాధ ఇలా ఒక్కటేమిటి.. మనం చెప్పాలనుకునే మాటలను, మనస్సులోని భావాలను చాలా సులభంగా చెప్పేందుకు ఎమోజీలు చక్కగా పనిచేస్తాయి. ఇక‌ ప్ర‌స్తుతం ఫేస్‌బుక్‌లో లైక్‌ కోసం ఉపయోగించే ధమ్స్‌అప్‌ ఎమోజీ, హార్ట్‌, లాఫింగ్‌, షాక్‌, శాడ్‌నెస్‌, యాంగర్‌ ఎమోజీలు మాత్రమే ఉన్నాయి. 

 

అయితే తాజాగా ఇప్పుడున్న ఈ ఆరు ఎమోజీలకు తోడు మరో ఎమోజీని ఫేస్‌బుక్‌ మనకోసం తీసుకువచ్చింది. అదే కేర్‌ ఎమోజీ. నవ్వుతున్న ఒక ఎమోజీ హార్ట్‌ సింబల్‌ని హత్తుకున్నట్లుగా ఈ కేర్‌ ఎమోజీని రూపొందించారు. ప్ర‌స్తుతం కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న ప‌రిస్థితుల్లో.. మన వారికి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఈ కేర్‌ ఎమోజీని యూజ్ చేస్తారు. ఇక ఫేస్‌బుక్‌తో పాటు మెసేంజర్‌లో కూడా పర్పుల్‌ కలర్‌లో ఉండే పల్స్‌ హార్ట్‌ ఎమోజీని కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చారు.  కేర్‌ ఎమోజీ నేటి నుంచే ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షం కానుంది. బీటా టెస్టర్‌ ప్రోగ్రామ్‌ ఇప్పటికే ఎనేబుల్‌ చేసుకున్న వారికి ఆటోమెటిక్‌గా ఈ ఎమోజీ వస్తుంది. ఇక  కొత్తగా వచ్చిన ఈ కేర్ ఎమోజీ యూజర్లను ఆకట్టుకోవడంతో పాటు ఎంతో యూజ్ అవుతుంద‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: