నేటి స‌మాజంలో కంప్యూటర్‌ వినియోగం ఓ రేంజ్‌లో విస్తరించింది. అదీ ఇదీ అని కాకుండా.. ఏ పనికైనా కంప్యూట‌ర్ వినియోగం తప్పనిసరిగా మారింది. వాస్త‌వానికి తొలినాళ్లలో కంప్యూటర్‌ ఒక సంచలనం అని చెప్పుకోవాలి. అప్పుడు డెస్క్‌టాప్‌ మాత్రమే అంద‌రికీ తెలుసు. కానీ, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్న కంప్యూటర్లలోనూ భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ల్యాప్‌టాప్‌లు విస్తరించాయి. హై రిజల్యూషన్‌, వేగవంతమైన ప్రాసెసర్‌, ఆధునిక ఫీచర్లతో చేతిలో ఇమిడిపోయే సైజుల్లో ల్యాప్‌ట్యాప్‌లు మార్కెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

IHG

వాస్త‌వానికి ఇప్పుడంటే టెక్నాలజీ, గ్యాడ్జెట్స్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది కానీ ఒకప్పుడు ల్యాప్‌టాప్‌ అంటేనే ఏదో వింతైన పరికరంలా చూసేవారు. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. ల్యాప్‌టాప్‌ను టీవీకి క‌నెక్ట్ చేయ‌డం ఎలాగో మీకు తెలుసా..? ఒక‌వేళ తెలియ‌క‌పోతే.. ఇప్పుడు తెలుసుకుందాం. ల్యాప్‌టాప్‌ను హెచ్‌డిఎమ్ఐ కేబుల్ ద్వారా టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే కనెక్ట్ చేసేందుకు మీరు ఎంపిక చేసుకున్న ల్యాప్‌టాప్ అలానే టీవీ హెచ్‌డిఎమ్ఐ పోర్ట్‌లను ఉండాలి. మార్కెట్లో హెచ్‌డిఎమ్ఐ కేబుల్స్ ఒక మిటర్ నుంచి ఐదు మిటర్ల నిడివ వరకు ఉంటాయి. 

IHG

మీ అవసరాన్ని బట్టి వాటిలోనచ్చిన కేబుల్‌ను మీరు కొనుగోలు చేసుకోండి. ఇక ల్యాప్‌టాప్‌ను టీవీకి కనెక్ట్ చేసే క్రమంలో ముందుగా ల్యాప్‌టాప్ అలానే టీవీని ఆన్ చేసి పెట్టండి. ఇప్పుడు మీ వద్ద ఉన్న హెచ్‌డిఎమ్ఐ కేబుల్‌‍ను టీవీ అలానే ల్యాప్‌టాప్‌కు క‌నెక్ట్ చేయండి. ఇప్పుడు మీ టీవీ రిమోట్‌లో ఏవీ బటన్‌ను క్లిక్‌ చేయటం ద్వారా టీవీ తెర పై ల్యాప్‌టాప్ తెర ద‌ర్శ‌న‌మిస్తుంది. ఇప్పుడు మీ ల్యాప్‌టాప్‌ను టీవీకి కనెక్ట్ చేసుకుని చ‌క్క‌గా.. హైడెఫినిషన్ క్వాలిటీ వీడియో అనుభూతులను బిగ్ స్క్రీన్‌లో ఎంజాయ్ చేయండి.

 
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: