వాట్సాప్‌.. పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న ప్ర‌తి ఒక్క‌రూ వాట్సాప్‌ను కూడా యూజ్ చేస్తున్నారు. మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్ సులువుగా ఉండ‌డంతో కోట్లాది మంది వాట్సాప్‌ను వినియోగించ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. ఇక వాట్సాప్ సైతం ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తూ.. యూజ‌ర్ల‌ను విప‌రీతంగా ఆక‌ర్షిస్తుంది. 

 

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. వాట్సాప్‌లో `డిలీట్ ఫ‌ర్ ఎవ్రీవ‌న్‌` ఫీచ‌ర్ తెలియ‌ని వారుండ‌రు. ఈ ఫీచ‌ర్ వ‌ల్ల మెసేజ్ చేసిన తర్వాత దాన్ని ఇద్దరికీ డిలీట్ చేసుకోవడానికి వీలుంది. ఈ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ వచ్చాక ఎవరికైనా పొరపాటున మెసేజ్ పంపితే.. మెసేజ్ వెంట‌నే డిలీట్ ఫ‌ర్ ఎవ్రీవ‌న్ చేయొచ్చు. కానీ, ఈ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించేవారు కొన్ని విష‌యాలు తెలుసుకోవాలి. మీరు ఐఫోన్ పంపేవారికి ఫొటో పంపి దాన్ని డిలీట్ చేస్తే అది వారి గ్యాలరీలో సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఐఫోన్ తన స్టోరేజ్ లోకి వాట్సాప్ ను అనుమతించదు. 

 

అలాగే మీరు పంపిన మెసేజ్ లు అవతలి వారి ఫోన్లలో కూడా డిలీట్ అవ్వాలంటే మీరు, అవతలి వారు కూడా వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ఉపయోగిస్తూ ఉండాలి. అలా అయితేనే మీరు పంపిన మెసేజ్ అవతలి వారి ఫోన్లలో డిలీట్ అవుతుంది. ఇక ఆండ్రాయిడ్ ఫోన్లలో మీకు ఈ సమస్య తలెత్తదు. మీరు పంపే వీడియోలు, ఫొటోలు వాట్సాప్ తో పాటు గ్యాలరీ నుంచి కూడా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. మ‌రియు మెసేజ్‌ పంపిన గంటా 8 నిమిషాల 16 సెకెన్ల వరకే ఈ డిలీట్‌ ఆప్షన్‌ పనిచేస్తుంది. అంటే ఈ వ్యవధి దాటితే 'డిలీట్‌ ఫర్‌ మి' ఆప్షన్‌ మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: