భారతదేశంలో అతి తక్కువ ధరకి ఎక్కువ స్పెసిఫికేషన్లను కలిగి ఫోన్లో ప్రపంచంలో తనకంటూ రారాజుగా ఎదిగిన సంస్థ Xiaomi. మధ్య తరగతి ప్రజలను, అలాగే పేదలను దృష్టిలో ఉంచుకొని అతి తక్కువ ధరలకు ఎక్కువ స్పెసిఫికేషన్స్ కలిగిన కొన్ని కోట్ల ఫోన్లను విక్రయించడం ద్వారా  భారతదేశంలో ఈ కంపెనీ అమ్ముతూ నెంబర్ వన్ గా నిలిచింది. ప్రముఖ దిగ్గజ ఫోన్ల తయారీ సంస్థ xiaomi రెడ్ మి సిరీస్లో నోట్ 9 ప్రో, నోట్ 9 ప్రో మాక్స్ పేరుతో రెండు కొత్త స్మార్ట్ ఫోన్ లను భారత్లో విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం రెడ్మీ నోట్ ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్లు అమ్మకాలు కొనసాగించేందుకు అన్ని రకముల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన సేల్ మే 12 నుంచి మొదలవుతుందని కంపెనీ తెలియజేయడం జరిగింది.

 

 


ఇక దేశవ్యాప్తంగా గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో ఈ స్మార్ట్ ఫోన్ లను అమ్మకాలు కొనసాగించేందుకు కంపెనీ అధికారులు సిద్ధపడ్డారు. అలాగే కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు రెడ్ జోన్ లో ఫోన్లను అమ్మ కూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈ ఫోన్లను mi.com, అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు అని కంపెనీ అధికారులు తెలియజేశారు. ఈ ఫోన్ కు సంబంధించిన మే 12 న మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్ సేల్ ప్రారంభం అవ్వబోతుంది. ఈ ఫోన్ నాలుగు కలర్స్ లో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.

 

 

ఇక ఈ ఫోన్ 3  వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. వాటి వివరాలు మీ కోసం.. 8GB ram, 128GB స్టోరేజ్ ఫోన్‌ ధర రూ. 19,999.,  6GB/64GB వేరియంట్‌ ఫోన్‌ ధర రూ. 16,499., 6GB/128GB వేరియంట్‌ ఫోన్‌ ధర రూ. 17,999. 

మరింత సమాచారం తెలుసుకోండి: