నేటి త‌రానికి వాట్సాప్ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. రోజువారి అవసరాలకు వాట్సాప్‌ను కోట్ల మంది వినియోగిస్తున్నారు. మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు ఇతరితర వాటికి వాట్సాప్ వినియోగం సులువుగా ఉండడంతో.. దీనివైపే అంద‌రూ మొగ్గు చూపుతున్నారు.   రోజులు మారుతున్న కొద్దీ కొత్త కొత్త ఫీచర్లతో, హంగులతో వరల్డ్ నంబర్ వన్ మెసేజింగ్ యాప్‌గా కొనసాగుతోంది.  ఇక ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా కేంద్రం దేశ‌మంత‌టా లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌జలంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఈ క్ర‌మంలోనే వాట్సాప్ వినియోగం మ‌రింత పెరిగిపోయింది. 

 

ఇదిలా ఉంటే.. ఒక్కోసారి మన ప్రమేయం లేకుండా ఎవరో క్రియేట్ చేసిన గ్రూప్‌లో మ‌న‌ల్ని చేరుస్తుంటారు. ఇది కొందరికి విసుగ్గా ఉంటోంది. మనకు ఇష్టం లేకున్నా గ్రూప్‌లో చేరుస్తుండటం.. మనకు ఇష్టం లేకపోయినా, మొహమాటం కోసం అందులో ఉండాల్సి ఉంటుంది. అందుకే వాట్సాప్ లో అత్యంత తలనొప్పి కలిగించే అంశం ఏదైనా ఉందా అంటే గ్రూపులే అని చెప్పుకోవ‌చ్చు. అయితే దీన్నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే కొన్ని ప్రైవసీ సెట్టింగ్‌ మార్చుకోవచ్చు.  దీని వ‌ల్ల మనం ఏ గ్రూప్ పడితే ఆ గ్రూప్ లో జాయిన్ చేయడానికి వీలుండ‌దు. ఇందుకు ముందుగా..  మీరు వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. 

 

అందులో అకౌంట్ మీద క్లిక్ చేసి, ప్రైవసీలోకి వెళ్లాలి. అక్కడ మీకు గ్రూప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీకు ఎవ్రీ వన్, మై కాంటాక్ట్స్, నో బడీ అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. ఎవ్రీ వన్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని ఎవరైనా గ్రూప్స్ లో యాడ్ చేయవచ్చు. మై కాంటాక్ట్స్ మీద క్లిక్ చేస్తే కేవలం మీ కాంటాక్ట్స్ లో ఉన్న వారు మాత్రమే మిమ్మల్ని గ్రూప్స్ లో యాడ్ చేయగలరు. ఇక నో బడీ ఎంచుకుంటే ఎవరూ మిమ్మల్ని గ్రూప్స్ లో యాడ్ చేయలేరు. దాని బదులుగా మీకు వాట్సాప్ గ్రూప్ ఇన్విటేషన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మీకు నచ్చిన గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: