నేటి స‌మాజంలో ప్ర‌తి ఒక్క‌రి చేతులో స్మార్ట్ ఫోన్ ద‌ర్శ‌న‌మిస్తోంది. ప్రపంచాన్ని మన అరచేతిలోకి తెచ్చేసింది. డెస్క్‌ టాప్‌, ల్యాప్‌ టాప్, ట్యాబ్లెట్లు ఇలా ఎన్ని వచ్చినా అరచేతిలో ఇమిడిపోయే బుల్లి కంప్యూటర్‌ స్మార్ట్‌ఫోన్‌. ప్ర‌స్తుతప‌రిస్థితుల్లో ఫోను లేకుండా రోజు గడవడం కష్టంగా మారింది. అస‌లు ఫోన్ లేకుండా బ‌య‌ట కాలే పెట్ట‌డం లేదు. బిచ్చ‌గాడి ద‌గ్గ‌ర‌నుంచి కోటీశ్వ‌రుల వ‌ర‌కు స్మార్ట్ ఫోన్ ఉప‌యోగించేవాళ్లే. ఉదయం లేచినప్పటి నుంచి అర్ధరాత్రి పడుకునే వరకు ఫోన్ పక్కన ఉండాల్సిందే. ఇక ఉద‌యంలేవ‌గానె ముందుగా చూసెది కూడా స్మార్ట్ ఫోన్‌నే. అంత‌లా ప్ర‌పంచం మొత్తం స్మార్ట్‌ఫోన్‌కు అల‌వాటు ప‌డిపోయింది.

 

దీని బ‌ట్టీ చూస్తుంటే.. అస‌లు మన గుప్పెట్లో స్మార్ట్‌ఫోన్ ఉందో.... స్మార్ట్‌ఫోన్‌ గుప్పెట్లో మనమున్నామో తెలుసుకోలేని సంకట స్థితిలోకి వ‌చ్చేశాము. అయితే... దీని సంగతి పక్కనబెడితే.. స్మార్ట్‌ఫోన్‌లో ఎన్నో ఫీచ‌ర్లు ఉంటాయి. అందులో అతి ముఖ్య‌మైన వాటిలో డార్క్ మోడ్ కూడా ఒక‌టి. డార్క్ మోడ్ అందుబాటులో ఉంటే బ్యాక్ గ్రౌండ్ మొత్తం నల్ల రంగులోకి లేదా బూడిద రంగులోకి మారిపోతుంది. ఈ డార్క్ మోడ్ ను యాక్టివేట్ చేయడం ద్వారా మీ బ్యాటరీ సేవ్ అవ్వడంతో పాటు, ఫోన్ ను ఉపయోగించేటప్పుడు మీ కంటి మీద పడే భారం కూడా తగ్గుతుంది. ఆండ్రాయిడ్ 9 లోనే డార్క్ మోడ్ కు సంబంధించిన కొన్ని విషయాలను మనం ఇప్ప‌టికే తెలుసుకున్నాం.

 

ఇక‌ ఆండ్రాయిడ్ 10తో గూగుల్ పూర్తిస్థాయి డార్క్ మోడ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మీరు ఏ స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు అనే అంశంపై కూడా మీ ఫోన్ లో డార్క్ మోడ్ అందుబాటులో ఉందా లేదా అని తెలుస్తుంది. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ 10 మీద పని చేసే స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నట్లయితే.. మీరు సిస్టం వైడ్ డార్క్ మోడ్ ను ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఆండ్రాయిడ్ 9 పైన పనిచేసే స్మార్ట్ ఫోన్ లో అయినా సరే.. కొన్ని కంపెనీలు కస్టం ఆపరేటింగ్ సిస్టంల్లో డార్క్ మోడ్ ను అందించాయి. అలాంటి ఫోన్లలో కూడా మీరు డార్క్ మోడ్ ను ఆన్ చేసుకోవ‌చ్చు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: