నేటి కాలం ప్ర‌జ‌ల‌కు వాట్సాప్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్న ప్ర‌తి ఒక్క‌రూ వాట్సాప్‌ను యూజ్ చేస్తున్నారు.  గుడ్ మార్నింగ్ తో మొదలుకొని గుడ్ నైట్ వరకు కొన్ని వందల మెసేజెస్..వీడియో కాల్స్,వాయిస్ కాల్స్,ఫోటోలు ,వీడియోలు షేర్ చేసుకోవడానికి అందరికి చాలా సులువుగా ఉన్న యాప్ వాట్సాప్. అందుకే వాట్సాప్ వినియోగించే వారి సంఖ్య కోట్ల‌లో ఉంది. వాట్సాప్ సైతం ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకువ‌స్తూ.. యూజ‌ర్ల‌ను ఆక‌ట్టు‌కుంటోంది. ఈ క్ర‌మంలోనే వాట్సాప్‌లో టన్నుల కొద్దీ ఫీచర్లు ఉన్నాయి. కాని వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ చేసే సామర్థ్యం ఇంకా లేదు.

 

అయితే ప్రస్తుతం ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ రెండింటిలోనూ వాట్సాప్‌లో మెసేజ్ లను షెడ్యూల్ చేయడానికి మార్గాలు ఉన్నాయి. ఎలా అంటే థర్డ్ పార్టీ యాప్స్ ఎంచుకోవ‌డం వ‌ల్ల మెసేజ్ షెడ్యూల్ చేయ‌వ‌చ్చు. అందుకు ముందుగా మీరు.. గూగుల్ ప్లే స్టోర్‌ ద్వారా SKEDit ను డౌన్‌లోడ్ చేసి దానిని ఇన్‌స్టాల్ చేయండి. మొదట దీనిని ప్రారంభించడానికి ఇందులో మీరు సైన్ అప్ చేయాలి. మీరు సైన్ ఇన్ చేసిన తర్వాత మెయిన్ మెనూలో వాట్సాప్‌పై క్లిక్ చేయండి. ఆ త‌ర్వాత స్క్రీన్‌లో మీరు కొన్ని అనుమతులు ఇవ్వాలి. యాక్సిస్ ను ప్రారంభించడానికి ఎనేబుల్ యాక్సిస్ > SKEDit> యూస్ సర్వీసును టోగుల్ చేయండి. 

 

ఇప్పుడు యాప్ కి తిరిగి వెళ్లి.. మెసేజ్ ను పంపవలసిన వారి నెంబర్ ను జోడించి, మీ యొక్క మెసేజ్ ను నమోదు చేయండి. అలాగే షెడ్యూల్ తేదీ మరియు సమయాన్ని సెట్ చేయండి మరియు మీరు షెడ్యూల్ చేసిన మెసేజ్ ను పునరావృతం చేయాలనుకుంటున్నారా లేదా అని సెలెక్ట్ చేసుకోండి. పంపే ముందు నన్ను అడగండి అనే చివరి టోగుల్ ను మీరు కింద చూస్తారు. దీన్ని టోగుల్ చేయండి> అందులో టిక్ చిహ్నాన్ని నొక్కండి> మీ మెసేజ్ ఇప్పుడు షెడ్యూల్ చేయబడుతుంది. మీ షెడ్యూల్ మెసేజ్ యొక్క రోజు మరియు టైమ్‌ వచ్చినప్పుడు మీ ఫోన్‌లో దాన్ని కంప్లీట్ చేయమని అడుగుతూ నోటిఫికేషన్ అందుకుంటారు. అప్పుడు సెండ్ మీద నొక్కితే.. మీ మెసేజ్ మీరు పెట్టిన స‌మ‌యానికి ష‌డ్యూల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: