క‌రోనా మ‌హ‌మ్మారి మాన‌వుని జీవ‌న గమ‌నాన్ని, విధానాన్ని చాలా వ‌ర‌కు మార్చేసింది. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లాలంటే అనేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే.. లేదంటే క‌రోనా కాటుకు బ‌లికావాల్సిందే. ఏమాత్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించి నా..ఏమ‌రుపాటు గా వ్య‌వ‌హ‌రించిన భారీ మూల్యాన్ని చెల్లించుకోక త‌ప్ప‌దు. త‌మ ప్రాణాల‌నే కాదు..కుటుంబ స‌భ్యుల ప్రాణాల‌ను అపాయంలో ప‌డే ప్ర‌మాదం ఉంటుంది. అందుకే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వ్యాధి  నియంత్ర‌ణ‌కు అనేక మార్గాలు అన్వేషించ‌డంలో ఆయా దేశాల ప్ర‌భుత్వాలు, శాస్త్ర‌వేత్త‌లు శోధించే ప‌నిలో ఉన్నారు.  ఈక్ర‌మంలోనే అంత‌ర్జాతీయ‌, జాతీయ ప్ర‌యాణీల‌కు ఎంతో సౌక‌ర్యంగా ఉంటున్న విమాన స‌ర్వీసుల్లో అనేక మార్పుల‌కు శ్రీకారం చుడుతున్నారు. 

 

ఇకపై  విమానం ఎక్కాలంటే భౌతిక‌దూరం పాటించాల్సిందే...ప‌క్క‌ప‌క్క‌నే కూర్చోవ‌డానికి ఎంత‌మాత్రం అవ‌కాశం ఇవ్వ‌లేని ప‌రిస్థితి. సీటింగ్ విధానంలోనూ మార్పులు ఉంటాయి. ఐసొలేషన్‌ క్లాస్  అనే కొత్త ప్రయాణ తరగతి పుట్టుకు వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌ని కొంత‌మంది నెటిజ‌న్లు స్పంద‌న తెలియ‌జేస్తున్నారు. ఇక నోరూరించే వేడివేడి వంటకాలు దొరక‌క‌పోవ‌చ్చు. టచ్‌స్క్రీన్లు మాయం కానున్నాయి. అసలు ఆరోగ్య పరీక్షల్లో నెగ్గకుండా ప్రయాణమే చేయలేం అన్న‌ది వాస్త‌వం.  ఇలాంటి ఎన్నెన్నో మార్పుల్ని విమాన ప్రయాణాల్లో చూడొచ్చు. ఆరోగ్యాన్ని కాపాడేది భౌతిక దూరమే అన్న ప్రధాన సూత్రానికి అనుగుణంగా భవిష్యత్తులో ప్రయాణాలుంటాయన్నది యథార్థం.

 

 భార‌త్‌లోనూ అంత‌ర్జాతీయ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా విమాన స‌ర్వీసుల్లో కొత్త విధానాల అమ‌లుకు తుది రూప‌క‌ల్ప‌న  చేయ‌డంలో అధికారులు నిమ‌గ్న‌మ‌య్యారు. ప్ర‌యాణానికి  దాదాపు రెండు గంట‌లు ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉంటుంది. కొవిడ్‌-19కి సంబంధించి సమగ్ర ప్రశ్నావళికి సమాధానాలివ్వాలి. ముఖ్యంగా జ‌ర్నీ హిస్ట‌రీకి సంబంధింన విష‌యాలేవీ దాచొద్దు. క‌రోనా టెస్టుల‌కు పూర్తిగా స‌హ‌క‌రించాల్సి ఉంటుంది. క్యాబిన్‌ బ్యాగేజీని వెంట‌ తీసుకెళ్లడానికి వీల్లేదు. మీ ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్‌ తప్పనిసరిగా ఉండాలి.  శరీర ఉష్ణోగ్రతలను తనిఖీ చేయాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ప్రయాణికులతో పాటు పైలట్లు, విమాన సిబ్బందికి కూడా నిబంధనలు వర్తింపజేయనున్నారు. భద్రతా సిబ్బంది, విమానాశ్రయ నిర్వహణ సిబ్బందికి వర్తిస్తాయని, విమానాశ్రయాల్లో భౌతిక దూరం నిబంధన కచ్చితంగా అమలు చేయాలని ముసాయిదాలో నిర్ణయించారు.

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: