ప్రముఖ చైనా దేశం యొక్క మొబైల్ కంపెనీ అయిన రియల్ మీ సరికొత్త సంచలనానికి దారి తీసింది. ఆ కంపెనీ సోమవారం నాడు ఫ్లిప్ కార్ట్ లో అమ్మకానికి ఉంచిన సరికొత్త మోడల్ రియల్ మీ నార్జో 10 అమ్మకాల్లో కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ మొబైల్ ఫోన్ యొక్క ఖరీదు రూ. 11999. 

IHG


ఈ మొబైల్ కేవలం 128 సెకన్లలోనే అత్యధిక రికార్డుస్థాయిలో 70 వేలకు పైగా ఫోన్లను ఆ కంపెనీ అమ్మడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కు వేగం ఎంతో అవసరం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఫోను ఎంచుకున్న వారందరికీ ధన్యవాదాలు అంటూ రియల్ మీ ఇండియా సీఈఓ మాధవ్ సేత్ తెలిపారు.

IHG


ఇక ఆ కంపెనీ నుండే రియల్ నార్జో 10A ఫోన్ విక్రయాలు కూడా ఈనెల 22వ తారీకు నుంచి మొదలు కాబోతుంది అని ఆయన తెలిపారు. ఆ ఫోన్ యొక్క ధర రూ. 8499. గత రెండు నెలలుగా లాక్ డౌన్ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ విక్రయాలు పూర్తిగా ఆగిపోవడంతో వినియోగదారులు నూతన స్మార్ట్ ఫోన్ లను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ రియల్ మీ నార్జో సిరీస్ ఫోన్లు కేవలం ఫ్లిప్ కార్ట్, రియల్ మీ డాట్ కాం, అంతే కాకుండా కేవలం ఎంపిక చేసిన ఆఫ్ లైన్ స్టోర్ లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: